ETV Bharat / sitara

కరోనా బాధితులకు అండగా సినీ లోకం!

కరోనా బాధితులకు అండగా నిలవడానికి ముందుకొచ్చారు పలువురు తారలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.

Bollywood celebs who have donated money for COVID relief
కరోనా బాధితులకు అండగా సినీ లోకం!
author img

By

Published : May 10, 2021, 3:11 PM IST

కరోనా కష్టకాలంలో చాలామంది ప్రముఖులు వారికి తోచిన సాయం చేస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఆపదలో ఉన్న వారికి మద్దతుగా ఉంటూ హీరోగా మాారారు సోనూసూద్. మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. అక్షర్ కుమార్, ట్వింకిల్​ ఖన్నా, సల్మాన్ ఖాన్​తో పాటు పలువురు ఆపత్కాలంలో మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరెవరు ఏం సాయం చేశారో చూద్దాం.

  • టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ రూ.2 కోట్లు సాయం చేశారు. అలాగే కరోనా బాధితుల సహాయార్థం కెట్టో అనే ఫౌండేషన్​ను ఏర్పాటు చేశారు.
    kohli, anushka
    కోహ్లీ, అనుష్క శర్మ
  • బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కరోనా బాధితులకు అండగా నిలిచారు. ప్రముఖ పాడ్​కాస్టర్​ జయ్ శెట్టి ఏర్పాటు చేసిన ఫౌండేషన్​కు రూ.11.10 లక్షలు సాయం చేశారు.
  • బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్​తో కలిసి రూ.4 కోట్ల సాయం చేసింది. అలాగే బాధితులకు అండగా ఉండాలంటూ కోరింది.
    priyanka, jonas
    ప్రియాంకా చోప్రా దంపతులు
  • బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. కరోనా బాధితులకు అండగా నిలవడగానికి ముందుకొచ్చారు. ఆయన పిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తోన్న 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున సాయం చేశారు.
  • బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏర్పాటు చేసిన ఎన్​జీవోకు రూ. కోటి సాయం చేశారు. అలాగే అక్షయ్ కుమార్, అతడి సతీమణి ట్వింకిల్ ఖన్నా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను అందిస్తున్నట్లు ప్రకటించారు.
    akshay kumar, twinkle khanna
    అక్షయ్ కుమార్ దంపతులు
  • ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ కరోనా బాధితుల సహాయార్థం రూ.1.25 కోట్లు సాయం చేశారు. ప్రధానమంత్రి పీఎం కేర్స్ ఫండ్​కు రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, ఎఫ్​ఈఎఫ్​ఎస్​ఐ కార్మికులకు రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.
  • బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్​గణ్ ముంబయిలోని శివాజీ పార్క్ ఆవరణలో ఎమర్జెన్సీ యూనిట్​ను నెలకొల్పేందుకు రూ.1 కోటి సాయం చేశారు.
  • ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 7 లక్షలు విరాళంగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.