బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ప్రధానపాత్రలో.. దర్శకుడు మోహన్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'బ్లాక్ రోజ్'. దర్శకుడు సంపత్ నంది రచనలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కొవిడ్ బారిన పడకుండా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుని చిత్రీకరణ ప్రారంభించినట్లు నిర్మాత తెలిపారు.
-
Dear friend @mohanbharadwaja.. good luck on ur career as a director👍🏾hope n believe you will make me n my decision proud. Extremely thankful to #Srinu garu and #Pawan garu for accepting my proposal and giving him an opportunity. Indebted forever🙏🏾🙏🏾🙏🏾#BlackRose @SS_Screens pic.twitter.com/VEuM3AoKsT
— Sampath Nandi (@IamSampathNandi) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear friend @mohanbharadwaja.. good luck on ur career as a director👍🏾hope n believe you will make me n my decision proud. Extremely thankful to #Srinu garu and #Pawan garu for accepting my proposal and giving him an opportunity. Indebted forever🙏🏾🙏🏾🙏🏾#BlackRose @SS_Screens pic.twitter.com/VEuM3AoKsT
— Sampath Nandi (@IamSampathNandi) August 18, 2020Dear friend @mohanbharadwaja.. good luck on ur career as a director👍🏾hope n believe you will make me n my decision proud. Extremely thankful to #Srinu garu and #Pawan garu for accepting my proposal and giving him an opportunity. Indebted forever🙏🏾🙏🏾🙏🏾#BlackRose @SS_Screens pic.twitter.com/VEuM3AoKsT
— Sampath Nandi (@IamSampathNandi) August 18, 2020
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.."షేక్స్పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్'లోని షైలాక్ పాత్ర ఆధారంగా మహిళా ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం' అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాన్ని జోడిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. కళాదర్శకుడిగా ఆచార్య సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.