ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' నుంచి విషెస్.. స్నేహితుల మధ్య కెేక్ కటింగ్ - అలియా భట్​ న్యూస్​

ముద్దుగుమ్మ ఆలియాభట్.. తన పుట్టినరోజును స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. రెండు చేతులతో రెండు కేక్​లు కొస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈమెకు 'ఆర్ఆర్ఆర్' బృందం నుంచి శుభాకాంక్షలు వచ్చాయి.

Bollywood actress Alia Bhatt is celebrating her birthday with a girl gang
ఒకేసారి రెండు కేక్​లు కోసిన ఆలియాభట్
author img

By

Published : Mar 15, 2020, 11:08 AM IST

Updated : Mar 15, 2020, 11:54 AM IST

తన 27వ​ పుట్టినరోజును స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకొంది బాలీవుడ్ నటి ఆలియాభట్. రెండు కేక్​లు ఒకేసారి కట్ చేస్తూ సందడి చేసింది. ఆ వీడియోలను ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బాలీవుడ్​లో 'స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​'తో అరంగేట్రం చేసింది ఆలియా. వరుస విజయాలు సాధిస్తూ, స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 1999లోనే వచ్చిన 'సంఘర్ష్​' సినిమాలో కథానాయిక​ ప్రీతిజింటా చిన్నప్పటి పాత్రలో కనిపించిందీ ఈమె. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Bollywood actress Alia Bhatt is celebrating her birthday with a girl gang
అలియా భట్​

'ఆర్​ఆర్​ఆర్​' బృందం శుభాకాంక్షలు​

అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం. "నీ రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం" అని రాసుకొచ్చింది. రామ్​చరణ్-ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్.. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. ముద్దుగుమ్మ అనుష్క పాటించే 12 రకాల సూత్రాలు

Last Updated : Mar 15, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.