ETV Bharat / sitara

నువ్వే కావాలి@20: అభినవ క్లాసిక్​గా అనితర ఖ్యాతి - 20 years

కథాబలం.. కథనాన్ని నడిపించే సంభాషణలు, కమ్మనైన సంగీతం, నటీనటుల ఎవర్​గ్రీన్​ పెర్ఫార్మెన్స్..​ అన్నీ పొందికగా కుదిరితే ఆ సినిమా అత్యద్భుత విజయ సాధించటమే కాదు.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపోతుంది. అందుకు రుజువే 'నువ్వే కావాలి'. రెండు దశబ్దాల క్రితం ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు, తిరగరాసిన చరిత్ర ఒకెత్తైతే.. ప్రేక్షకులు ఇప్పటికీ మధురానుభూతిగా ఆస్వాదించే తీరు 'నువ్వే కావాలి' చిత్రాన్ని మోడ్రన్​ డే క్లాసిక్​గా నిలబెడుతుంది. ఈ సినిమా ప్రస్థానానికి అక్టోబర్​ 13తో... 20 ఏళ్లు.

Nuvve kaavali completes 20
నువ్వే కావాలి@20... అభినవ క్లాసిక్​గా అనితర ఖ్యాతి
author img

By

Published : Oct 13, 2020, 6:36 AM IST

సినిమాలు మనిషి జీవితాన్ని తెరపై ప్రతిబింబిస్తాయి. సగటు మనిషి జీవితంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంటాయి. అంతటి ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో కొన్ని మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. సినిమా రిలీజ్​ అయి నేటికి 20ఏళ్లు పూర్తి అయినా.. మనసును గిలిగింతలు పెట్టే అందమైన అనుభూతిగా.. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హదృయాల్లో నిలిచిపోయిందంటే 'నువ్వే కావాలి' ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

నవ్యమైన, నాణ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే ఉషాకిరణ్‌ మూవీస్‌ ఈ సినిమాను 21వ శతాబ్దం తొలినాళ్లలో తెరకెక్కించింది. 20ఏళ్ల ప్రయాణం పూర్తైనా ఓ పాటగానో, మాటగానో, అంతకుమించి ఓ మధురానుభూతిగానో ఈ రోజుకీ గుర్తు చేసుకుంటున్నామంటే ఆ సినిమా ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ఇట్టే అర్థమవుతుంది.

ఆ రోజుల్లో...

అవి కమర్షియల్, మాస్ మసాలా సినిమాలు బాక్సీఫీస్​ను ఏలేస్తున్న రోజులు. కొత్తదనానికి ఎప్పుడూ పెద్దపీట వేసే ఉషాకిరణ్‌ మూవీస్‌.. నూతన శతాబ్దికి ఘనమైన స్వాగతం పలకాలని భావించింది. 1999 చివర్లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన "నిరమ్" సినిమా ప్రేరణగా నువ్వేకావాలి చిత్రాన్ని నిర్మించింది. యువతరం ఆలోచనలు, భావోద్వేగాలు, అంతర్మథనం అణువణువునా నిండిపోయిన సున్నితమైన ప్రేమకథ ఇది.

జట్టు కుదిరింది...

నువ్వేకావాలి చిత్రంలో కొత్తనీరు తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఫ్రేమ్‌లోనూ నవ్యత కనిపిస్తుంది. అప్పట్లో స్వయంవరం చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ భాస్కర్‌ను ఈ కథకు కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నారు.

స్వయంవరం సినిమాకు పనిచేసి ఆ తర్వాత సొంతూరు భీమవరం వెళ్లిపోయిన యువ రచయితకు ఉషాకిరణ్‌ మూవీస్ నుంచి మళ్లీ రమ్మని కబురు అందింది. తిరిగొచ్చిన అతడు సుదీర్ఘ సంభాషణలతో నిండిపోయిన తెలుగు సినిమాకు.. పెద్దగా పరిచయం క్రిస్పీ డైలాగులు, పంచ్ లైన్లతో అదరగొట్టాడు. అలా నువ్వే కావాలి విజయంలో కీలకంగా నిలిచిన ఆ రచయితే భవిష్యత్​లో మాటలమాంత్రికుడిగా ప్రేక్షకులను రంజింపజేసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. యుక్తవయస్సులో కలిగే ప్రేమ, సున్నితమైన ఆ భావోద్వేగాలు ఇలా అన్ని సంభాషణలను త్రివిక్రమ్ - విజయ్ భాస్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి: ''నువ్వే కావాలి'.. గుండెకు హత్తుకుపోయే సినిమా​'

మాటల మాంత్రికుడి మాయాజాలం

ఇడ్లీనా...డెడ్లీగా ఉంటుంది.

పాలంటే ఎలర్జీ, కానీ పాలే ఎనర్జీ.

నీకు ఉదయమే అయింది, నాకు జ్ఞానోదయం కూడా అయింది.

వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది.

మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం.

గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం.. కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం.

ఇష్టపడితే భయపడకు. భయపడితే ఇష్టపడకు. ఇష్టపడి, భయపడితే బాధపడకు.

ఇక కథానాయకుడి కోసం చాలా పేర్లు ప్రతిపాదనకు వచ్చినా చివరకు నటి రోజారమణి కుమారుడు తరుణ్‌ను కథ 'నువ్వే కావాలని' కోరుకుంది. అప్పటికే బాల నటుడిగా నంది, జాతీయ అవార్డులు అందుకుని తన ప్రతిభ చాటుకున్నాడు తరుణ్. అలా నువ్వే కావాలి కథకు సరిపోయే లక్షణాలున్న హీరో దొరికాడు. సుదీర్ఘ అన్వేషణ తర్వాత రిచా కథానాయికగా ఎంపికైంది. మరో కీలకపాత్రకు గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్‌ను తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్​గా నువ్వే కావాలి తెరకెక్కింది.

ఇదీ చూడండి: 'నువ్వే కావాలి' కోసం నేను, రిచా అలా: తరుణ్​

ఇదీ చూడండి: ''నువ్వే కావాలి' నన్ను ఆర్థికంగా ఆదుకుంది'

కడుపుబ్బా నవ్వించిన కామెడీ..

సునీల్, ఎమ్​ఎస్​ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మెల్కొటే- కోవై సరళ కాంబినేషన్​లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సునిల్‌కు కూడా ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

సంగీతానికి ఉన్న స్థానం అనిర్వచనీయం

సుస్వరాల మాంత్రికుడు.. కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు ఎన్నటికీ వన్నె తరగని వర్ణాలను అద్దింది. కోటి వీనులవిందైన స్వరాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర కలాలు తోడై ఉర్రూతలిగించే గీతాలతో నువ్వేకావాలి పాటల పూదోట విరబూసింది.

"అనగనగా ఆకాశం ఉంది" పాట ఎన్ని అంత్యాక్షరీల్లో భాగం అయ్యిందో చెప్పటం కష్టమే.

"కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు" అంటూ కథానాయిక అంతరంగాన్ని ఆవిష్కరించే భావోద్వేగ భరితమైన గీతం... చిత్రమ్మ గానామృతంతో ఎంతమంది గుండె తడిని రుచిచూసిందో ఎలా చెప్పగలం. పాట పాడుతున్నప్పుడు రెండో చరణంలో నిజంగానే చిత్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లతో పాడారట. పాటలో చిత్రమ్మ లీనమైపోయిన వైనానికి ఆశ్చర్యపోయిన కోటి... ఆమెకు గౌరవమిస్తూ ఆ పాటను యథాతథంగా ఉంచేశారట.

"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ" అని ఎంత మంది ప్రియులు తమ ప్రేయసుల కోసం పాడుకున్నారో...!

"ఒలె ఒలె ఊలా ఊలా" అంటూ ప్రత్యేక గీతంతో నాటి టాప్ హీరోయిన్ లైలా చేసిన సందడిని ఏ కుర్రాడూ మర్చిపోడు.

షుకురియా సాంగ్, అమ్మమ్మలు తాతయ్యలకు పాటలు శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఇదీ చూడండి:'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్: కోటి

ఇదీ చూడండి: 'నువ్వే కావాలి' నా జీవితంలో ఓ మైలురాయి: భువనచంద్ర

నువ్వేకావాలి.. ప్రభంజనం

తక్కువ ప్రింట్లతో తక్కువ థియేటర్లలో సరిగ్గా 20ఏళ్ల క్రితం అంటే 13 అక్టోబర్ 2000న విడుదలైన నువ్వేకావాలి. ప్రభంజనం మొదటిషో నుంచే మొదలైంది. ఆకట్టుకొనే కథనం, అద్భుతమైన పాటలు, అంతకు ముందెన్నడూ వినని పంచ్ డైలాగ్​లు, సంభాషణలు, లవ్ స్టోరీ అన్నీ కలగలసి సినిమాకు సూపర్ హిట్ టాక్ తెచ్చిపెట్టాయి. యువతలో ఎక్కడ చూసినా నువ్వే కావాలి టాపిక్కే. ఎక్కడ విన్నా నువ్వే కావాలి పాటలే తెలుగునాట మార్మోగాయి.

నువ్వే కావాలి విడుదలైన సమయంలో ఓటీటీల విప్లవం లేదు. స్వచ్ఛమైన సినిమా అనుభూతి కావాలంటే థియేటర్​కు వెళ్లాల్సిందే. ఇంటిల్లిపాది మొత్తాన్ని సినిమా హాల్​కు రప్పించాలంటే కథలో చాలా బలం ఉండాలి. కుటుంబ సమేతంగా చూడగలిగే నిర్మాణ విలువలు ఉండాలి. అవన్నీ సమపాళ్లలో సమకూరాయి కనుకనే నువ్వే కావాలి అంతటి ప్రశంసలు అందుకుంది. తొలుత చాలా తక్కువ థియేటర్లలో....తక్కువ ప్రింట్లతోనే రిలీజైనా... ప్రేక్షుకుల స్పందన.. మౌత్ పబ్లిసిటీ......ఈ సినిమాను శిఖరాగ్రానికి చేర్చాయి. ఊహించనంత స్థాయిలో థియేటర్లు పెంచారు. అలా అప్పటికీ వరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టటమే కాదు....ఉన్న చరిత్రను తిరగరాసింది నువ్వే కావాలి.

  • 20 థియేటర్లలో 200 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న తొలి సినిమాగా ఆల్ టైం రికార్డ్
  • ఆరు కేంద్రాల్లో 365 రోజులు ఆడి... మంచి సినిమా సత్తా దేశవ్యాప్తంగా చాటిన నువ్వే కావాలి.

సంచలన విజయం..

నువ్వేకావాలి తొలుత 22 ప్రింట్లతో మొదలై 110 ప్రింట్స్‌కు చేరటం ఆ రోజుల్లో ఒక సంచలనం. చిన్న సెంటర్ల నుంచి పెద్ద సెంటర్ల వరకూ విడుదలైన ప్రతి చోట 10 వారాల నుంచి 100 రోజులు ఆడటం అనేది ఇప్పటికీ చెరగని చరిత్ర. హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌లో 100వరోజు కాంప్లెక్స్‌లో ఉన్న 3 థియేటర్లలోనూ నువ్వే కావాలి చిత్రాన్ని 4 షోలు ప్రదర్శించినప్పుడు వందో రోజు కూడా టికెట్ల దొరక్క జనాలు తిరిగి వెళ్లటం ఇప్పటికీ ఒక రికార్డుగా భావిస్తారు.

అవార్డుల పంట

విశేషాభిమానాన్ని చూరగొన్న ఈ చిత్రానికి అనేక అవార్డులు, రివార్డులు వరించాయి.

ఫిల్మ్ ఫేర్- సౌత్ అవార్డులు

  1. ఉత్తమ చిత్రం పురస్కారం
  2. ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్
  3. ఉత్తమ నటుడిగా తరుణ్
  4. ఉత్తమ నటిగా రిచా
  5. ఉత్తమ నేపథ్యగాయకుడుగా శ్రీరామ్ ప్రభు
  6. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న నువ్వే కావాలి

ఈ సినిమాకు పనిచేసిన యువ బృందమంతా తమ ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు అందుకుని... సినీ పరిశ్రమలో ఆ తర్వాత అద్భుతమైన కెరీర్​ నిర్మించుకున్నారు. మంచి చిత్రాలనే నిర్మిస్తుందని ప్రేక్షకుల్లో నిశ్చితమైన అభిప్రాయాన్ని సంపాదించుకున్న ఉషాకిరణ్ మూవీస్ మరోసారి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ సినీ అభిమానుల హృదయాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

హిందీలోనూ రిమేక్​

ఉషాకిరణ్‌మూవీస్ సంస్థ ఇదే చిత్రాన్ని హిందీలో 'తుజే మేరీ కసమ్' పేరుతో నిర్మించింది. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ తనయుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరోగా ఈ చిత్రం ద్వారానే పరిచయం అయ్యారు. జెనీలియా డిసౌజా హీరోయిన్‌. హిందీలోనూ ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.

కొత్త శతాబ్దానికి.. కొంగొత్త సినిమా

మూస ధోరణితో సాగిపోతున్న తెలుగు సినిమాను ఓ సారి ఆపి....సంభాషణల పదును, సంగీతం ప్రాధాన్యాన్ని చూపించిన సినిమా నువ్వే కావాలి. యువతరం ఓ సినిమాను అక్కున చేర్చుకుంటే అదెంతటి ఘన విజయం సాధిస్తుందో నిరూపించిన చిత్రం నువ్వే కావాలి. కిక్కిరిసిపోయిన థియేటర్లు, టిక్కెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు... ఇవన్నీ ఏ స్టార్ హోదాలేని ఓ మాములు సినిమాకు సాధ్యమయ్యాయంటే కథలో ఉన్న బలం, నిర్మాణ విలువలు, చిత్రబృందం చేసిన కృషే కారణం. తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ఈ 20ఏళ్ల పండుగ, ఓ మంచి చిత్రాన్ని ఆదరించిన...ఆదరిస్తూనే ఉన్న ప్రతి ఒక్కరిదీ....మీది..మాది..మనందరిదీ.

ఇది చూడండి: ఎన్ని దశాబ్దాలైనా 'నువ్వే కావాలి' ముద్ర చెరగదు

ఇది చూడండి: 'సినిమా వందో రోజైనా టికెట్టు దొరకలేదు'

ఇది చూడండి: మాటల తూటా...పాటల తోట.. 'నువ్వే కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.