ETV Bharat / sitara

షారుక్ ఇంట్లో సంబరాలు.. దీపకాంతులతో ముస్తాబైన మన్నత్​ - unknown facts

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 2). అలాగే దీపావళి దగ్గర పడటం వల్ల ఆయన ఇంట్లో పండగ వాతవారణం మొదలైంది. ఆయన ఇల్లు 'మన్నత్'​ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుపోతోంది. దానికి సంబంధించిన వీడియో సహా బాద్​షా గురించి కొన్ని ఆసక్తికర సంగతులు మీకోసం..

sharukh
షారుక్​
author img

By

Published : Nov 2, 2021, 11:55 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇల్లు 'మన్నత్'​ దీపాల కాంతులతో వెలిగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆయనకు బర్త్​డే విషెస్​ తెలుపుతున్నారు. కాగా.. ప్రత్యేక సందర్భాలలో తన ఇంటిని అద్భుతంగా అలంకరిస్తారు షారుక్​. అయితే ఇటీవలే బాద్​ షా తనయుడు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలులో ఉండటం వల్ల ఆయన కుటుంబం దసరా ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆర్యన్​ బెయిల్​పై ఇంటికి వచ్చారు. దీంతో మళ్లీ బాద్​షా కుటుంబం ఆనందంలో మునిగితేలింది. ఈ నేపథ్యంలోనే షారుక్​ బర్త్​డే, దీపావళి పండగ రావడం వల్ల మన్నత్​ను దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

షారుక్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీకోసం..

  • షారుక్​, 1991 అక్టోబర్‌ 25న హిందూ సంప్రదాయ పద్ధతిలో పంజాబీ అమ్మాయి గౌరీ చిబ్బర్​ను(గౌరీ ఖాన్‌) పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల తరవాత వారికి 1997లో ఆర్యన్, 2000లో సుహానా పుట్టారు. 2013లో అభిరామ్‌ జన్మించాడు. ఈయన ఇంటిలో హిందూ దేవతల విగ్రహారాధనతో పాటు ఇస్లామ్ ప్రార్ధనలు కూడా చేస్తారు.
  • షారుక్​ ఖాన్‌ కేవలం నటుడే కాదు... ఒక మంచి నిర్మాత, బుల్లితెర ప్రయోక్త, సామాజిక కార్యకర్త, ధార్మికుడు కూడా. ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి, హీరోగా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.
  • దూరదర్శన్ టీవీ వ్యాఖ్యాతగా షారుక్ ఖాన్
  • షారుక్ సొంతంగా 'రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌' అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ద్వారా సినిమా నిర్మాణం, అడ్వర్​టైజింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, టెలివిజన్‌ సీరియళ్ల నిర్మాణం లాంటివి చేస్తున్నారు. సంస్థ వ్యవహారాలను భార్య గౌరీ ఖాన్‌ చూస్తున్నారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • ఆదాయపు పన్ను చెల్లించే నటుల జాబితా, అభిమానులు ఎక్కువగా ఆరాధించే నటుల జాబితాలో షారుక్ ముందు వరుసలో ఉంటారు. ఈయన నటించిన దాదాపు 80 సినిమాలు హిట్​ కావడం అదృష్టమే కాదు, ఆయన కృషికి సంకేతం.
  • షారుక్​ ఖాన్‌కు పాటలు పాడడమంటే సరదా. 'జోష్‌' సినిమాలో 'అపున్‌ బోలా తూ మేరీ లైలా' పాటను, 'డాన్‌'లో ఉదిత్‌ నారాయణ్‌తో కలిసి 'ఖైకే పాన్‌ బనారస్‌ వాలా, ఖుల్‌ జాయే బంద్‌ అకల్‌ కా తాలా' పాటను, 'జబ్‌ తక్‌ హై జాన్‌'లో టైటిల్‌ పద్యం ఆలపించారు. తన సొంత సినిమా 'ఆల్వేస్‌ కభి కభి'కు పాటలను స్వరపరచడంలో తనవంతు కృషి చేశారు.

  • ఫిల్మ్ ఫేర్, జీ సినీ, స్కీన్ర్‌ అవార్డ్‌ కార్యక్రమాలకు ప్రయోక్తగా, 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' టెలివిజన్‌ షోకు సంధానకర్తగా షారుక్ వ్యవహరించారు. 'ఇండియా నయీ సోచ్‌' లాంటి టాక్‌ షోలకు యాంకర్​గా చేశారు. మలేసియాలో ఆశా భోంస్లే సంగీత కార్యక్రమాలకు ప్రయోక్తగా, ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. పల్స్‌ పోలియో, ఎయిడ్స్‌ నిర్మూలన లాంటి ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలకు రాయబారిగా ఉన్నారు.
  • ఉత్తమ నటుడిగా 30 సార్లు ఫిల్మ్ ఫేర్​కు నామినేట్‌ అయిన ఒకే ఒక్క నటుడు షారుక్ ఖాన్‌. అందులో 14 సార్లు ఆ అవార్డును సొంతం చేసుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' ప్రదానం చేసింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ను, అత్యున్నత సివిలియన్‌ అవార్డును ఇచ్చి గౌరవించింది.
  • ఆన్​స్క్రీన్​ అయినా, ఆఫ్ స్క్రీన్​ అయినా బాలీవుడ్​ బాద్​షా కారు నంబరు '555' ఉంటుంది. ఆ సంఖ్య ఉన్న వాహనాన్నే షారుక్ నడుపుతారు. వేరేదైతే డ్రైవర్ ఉండాల్సిందే.

  • "సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఓ ఎడిటర్​ నా గురించి, నా సహనటి గురించి తప్పుగా కథనాలు​ రాశాడు. అవి చదివిన నేను, ఎందుకు ఈ విధంగా చేశాడోనని అతడిని అడిగాను. ఈ విషయాన్ని సిల్లీగా తీసుకున్నాడు. అందుకే తన ఆఫీస్​కు వెళ్లి గొడవపడి హెచ్చరించాను. ఆ తర్వాత యథావిధిగా షూటింగ్​కు వెళ్లిపోయాను. అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడాలని అన్నారు. స్టేషన్​కు రావాలని కోరారు. జరిగిన గొడవపై నన్ను అరెస్టు చేస్తున్నామన్నారు. ఆ సమయంలో వారిని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ వారు వినలేదు. కొన్ని గంటలపాటు జైలులో గడపవలసి వచ్చింది. ఆ తర్వాత బెయిల్​పై బయటికి వచ్చాను" అని షారుక్ గతంలో తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించారు.
  • ప్రస్తుతం షారుక్​.. 'పఠాన్'​ సినిమా సహా తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు ఆర్యన్​ డ్రగ్​ కేసులో ఇరుక్కోవడం వల్ల.. షూటింగ్స్​కు తాత్కాలికంగా బ్రేక్​ ఇచ్చారు బాద్​షా.

ఇదీ చూడండి: షారుక్​ సినిమా నుంచి తప్పుకున్న నయనతార!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.