బిగ్‌బాస్(bigg boss ott winner 2021) ఓటీటీ విన్నర్ దివ్యా అగర్వాల్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది(divya agarwal bigg boss). ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. దీనిని చూసిన అభిమానులు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
ఏం చేసిందంటే..
దివ్యా అగర్వాల్(divya agarwal latest photoshoot).. 'కార్టెల్' అనే ఓ వెబ్ షో కోసం ప్రోస్థటిక్ మేకప్ ద్వారా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారింది. వృద్ధుడిగా మారి అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఆ మేకప్ కోసం కదలకుండా కుర్చీలో అంత సేపు ఆమె కూర్చోవడం.. ఆ పాత్రను ఎంచుకోవడం.. నటన పట్ల ఆమెకు ఉన్న అంకితభావానికి నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దర్శకనిర్మాత ఏక్తా కపూర్ కూడా ఆమెను ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్నిసార్లు తామిద్దరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ ఓటీటీ షోలో(big boss ott) దివ్యా అగర్వాల్ విజేతగా అవతరించింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ట్రోఫీని సొంతం చేసుకోవడం సహా రూ.25లక్షల ప్రైజ్‌మనీని గెలుచుకుంది.
దివ్యా అగర్వాల్(divya agarwal bigg boss contestant).. నటి, మోడల్, డ్యాన్సర్. ఎమ్‌టీవీ ఇండియా నిర్వహించిన పలు రియాలిటీ షోల్లో పాల్గొన్ని క్రేజ్ సంపాదించుకుంది. రాగిని ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ 2 హారర్ వెబ్‌సిరీస్‌తో నటనలోకి అడుగుపెట్టింది. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం 'కార్టెల్' వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.
ఇదీ చూడండి: 'బిగ్‌బాస్' పోరీ.. మస్తుందిరో!