బిగ్బాస్ ఫేమ్ కన్నడ నటి జయశ్రీ రామయ్య సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరులోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని బలవ్మరణానికి పాల్పడినట్లు పోలీసుల వెల్లడించారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

గతేడాది ఇదే తరహాలో..
జయశ్రీ.. 2020 జులై 22న ఇదే తరహాలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోషల్మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే జయశ్రీ నివాసానికి వెళ్లి ఆమెను రక్షించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, సుసైడ్ చేసుకుంటున్నట్లు పోలీసులకు ఆమె వెల్లడించారు.

పోలీసులు ఆమెకు నచ్చచెప్పిన తర్వాత.. ఆత్మహత్య చేసుకుంటున్నా అనే పోస్టును కొన్ని గంటల తర్వాత డిలీట్ చేసిన జయశ్రీ.. "నేను క్షేమంగానే ఉన్నాను. లవ్ యూ ఆల్" అంటూ రాసుకొచ్చారు. అలా జరిగిన ఆరు నెలల తర్వాత జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇదీ చూడండి: యువ నటి ఆత్మహత్యాయత్నం.. ఆ విషయమే కారణం!