ETV Bharat / sitara

భావోద్వేగభరిత పాటతో రిషీకపూర్​కు బిగ్​బీ నివాళి - భావోద్వేగపు పాటతో రిషీకపూర్​కు అమితాబ్​ నివాళి

రిషీ కపూర్​, బిగ్​బీ కలిసి నటించిన ఓ భావోద్వేగభరిత పాటను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన అమితాబ్.. ఆయనకు నివాళులు అర్పించారు.

Big B's emotional video tribute to friend and colleague Rishi
భావోద్వేగపు పాటతో రిషీకపూర్​కు నివాళి : బిగ్​బీ
author img

By

Published : May 2, 2020, 4:20 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీకపూర్​కు ఘనంగా నివాళులు అర్పించారు ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​. 'వక్త్​ నే కియా క్యా హసీన్​ సితామ్'​ అంటూ సాగే భావోద్వేగభరిత పాట బ్లాక్​ అండ్​ వైట్​​ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​​ చేశారు. వీరిద్దరూ చివరగా కలిసి నటించిన '102 నాటౌట్​'​ సినిమాలోనిది గీతం. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.

మరో విశేషమేమిటంటే స్వయంగా బిగ్​బీ ఈ పాటను పాడారు. దీంతో పాటే "వక్త్​ వక్త్​ నే కియా క్యా హసీన్​ సితామ్​... తుమ్​ రహె నా తుమ్​, హమ్​ రహె నా హమ్​"అంటూ వ్యాఖ్య జోడించారు అమితాబ్​.

ఈ సినిమాలో తండ్రికొడుకులుగా నటించారు అమితాబ్-రిషీ. 102 ఏళ్ల తండ్రిగా బిగ్​బీ​, 76ఏళ్ల కొడుకుగా రిషీకపూర్​ నటించారు. గతంలో వీరిద్దరూ కభీకభీ(1976), అమర్​ అక్బర్​ ఆంటోని(1977), నసీబ్​(1981), కూలీ(1983), అజూబా(1991)వంటి హిట్​ చిత్రాల్లో నటించారు.

కొన్నేళ్లుగా క్యాన్స్​ర్​తో బాధపడుతున్న రిషీకపూర్​... ఏప్రిల్​ 30వ తేదీన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.