ETV Bharat / sitara

సర్​ప్రైజ్​లతో 'భీమ్లానాయక్'​, 'లైగర్'​ సిద్ధం - లైగర్​ మూవీ అప్డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'లైగర్'​, 'భీమ్లానాయక్'​, 'ఒకే ఒక జీవితం', 'ఖిలాడి' సహా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

లైగర్​ భీమ్లానాయక్​, Liger Bheemlanayak
లైగర్​ భీమ్లానాయక్​
author img

By

Published : Dec 28, 2021, 7:34 PM IST

Liger movie update: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' చిత్ర హంగామా మొదలుకాబోతుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 2022కు స్వాగతం చెబుతూ విజయ్ అభిమానులకు 'లైగర్​' చిత్రంలోని ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. రేపు ఉదయం 10.30గంటలకు బిగ్ అనౌన్స్​మెంట్​ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపిన చిత్రబృందం... డిసెంబర్ 30న విజయ్ లైగర్ స్పెషల్ స్టిల్స్​తో పాటు సాయంత్రం 4 గంటలకు ఇన్​స్టా ఫిల్లర్​ను రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించింది. ఫస్ట్ గ్లింప్స్​ను 31న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే కథానాయికగా నటించగా... రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు.

liger
లైగర్​

Muddy movie ott release date: యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'మడ్డీ'. ప్రగభల్‌ దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. డిసెంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విభిన్న చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబరు 31వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ప్రధాన నటులు రోడ్‌ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకోవడం గమనార్హం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Pawankalyan Bheemlanayak: పవన్​కల్యాణ్, రానా కలిసి​​ నటించిన 'భీమ్లానాయక్'​ నుంచి పవర్​ఫుల్​ అప్డేట్​ రానుంది. డిసెంబరు 29న ఉదయం 11గంటలకు దీన్ని ప్రకటించనున్నారు.

శర్వానంద్​, సీనియర్​ నటి అమల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమా టీజర్​ లాంఛ్​ ఈవెంట్​ను డిసెంబరు 29న మధ్యాహ్నం 2.30గంటల నుంచి ఏఎమ్​బీ మాల్​లో నిర్వహించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

okey oka jeevitam
ఒకే ఒక జీవితం

రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలోని 'అట్ట సూడకే' పాటకు సంబంధించిన ప్రోమోను డిసెంబరు 29 సాయంత్రం 5.04గంటలకు రిలీజ్ చేయనున్నారు. పూర్తి పాట 31వ తేదీన ఉదయం 10.08గంటలకు రిలీజ్​ కానుంది.

khiladi
ఖిలాడి

నాని, సాయిపల్లవి, కృతి శెట్టి నటించిన 'శ్యామ్​సింగరాయ్​'లోని 'సిరివెన్నెల' వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే ఈ చిత్రం విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది.

ఇదీ చూడండి: 'పుష్ప' థ్యాంక్స్​ మీట్​.. కన్నీరు పెట్టుకున్న బన్నీ, సుకుమార్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.