2008లో దిల్లీలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో 'బాట్లా హౌస్' తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలవనున్న ఈ సినిమాను చూసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేసింది చిత్రబృందం.
'ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చూపించడం గౌరవంగా భావిస్తున్నా. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతిని కలవాలని, మాట్లాడాలని ఎదురుచూస్తున్నా'. -జాన్ అబ్రహం, బాలీవుడ్ హీరో
నిఖిల్ అడ్వాణీ దర్శకత్వంలో వస్తోంది 'బాట్లా హౌస్'. ఈ సినిమాలో దిల్లీలో జరిగిన ఎన్కౌంటర్కు నాయకత్వం వహించిన డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ పాత్రలో కనిపించనున్నాడు జాన్ అబ్రహం.
'దేశం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసే వారంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిజ జీవిత కథలతో సినిమాలు తీయడం స్ఫూర్తి కలిగిస్తుంది. సంజీవ్ కుమార్ యాదవ్ అలాంటి వారిలో ఒకరు. ఈ పాత్ర కోసం ఆయనను కలిసి మాట్లాడాను'.
-జాన్ అబ్రహం, బాలీవుడ్ నటుడు
మృనాల్ ఠాకుర్, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించిన 'బాట్లా హౌస్' స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.
![batla house team with Venkaiah Naidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4039811_batla-house.jpg)