ETV Bharat / sitara

'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?.. రిలీజ్​పై టెన్షన్ - ఆర్​ఆర్​ఆర్​

Bangarraju Release Date: నాగార్జున 'బంగార్రాజు' సంక్రాంతి రిలీజ్​పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్'​ చిత్రాల విడుదల నేపథ్యంలో ఇతర సినిమాల రిలీజ్​ వాయిదా పడుతుండటమే అందుకు కారణం. మరి 'బంగార్రాజు' సంక్రాంతి బరిలో నిలుస్తాడా?

bangarraju release date
'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?-రిలీజ్​పై టెన్షన్
author img

By

Published : Dec 22, 2021, 2:08 PM IST

Bangarraju Release Date: సంక్రాంతి బరిలో 'ఆర్​ఆర్​ఆర్​', 'రాధేశ్యామ్​' వంటి బడా సినిమాలు ఉండటం వల్ల మిగతా సినిమాలు రేసు నుంచి తప్పుకొంటున్నాయి. ఇప్పటికే సూపర్​స్టార్​ మహేశ్​ బాబు నటించిన 'సర్కారు వారి పాట', పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-రానా కీలక పాత్రలు పోషించిన 'భీమ్లా నాయక్'​ చిత్రాలు బరి నుంచి వైదొలిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి 'బంగార్రాజు' మీద పడింది.

కింగ్​ నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి ప్రీక్వెల్​గా 'బంగార్రాజు' తెరకెక్కింది. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సంక్రాతికి స్పెషల్​గా వచ్చే ఏడాది జనవరి 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి 'బంగార్రాజు' సంక్రాంతి రేసులో ఉంటుందో లేక తప్పుకొంటుందో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి : 'పుష్ప' ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.