ETV Bharat / sitara

'సాహో'తో పోటీ నుంచి తప్పుకున్న సూర్య

'కాప్పన్' తెలుగు అనువాదం 'బందోబస్తు'.. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 30న కాకుండా సెప్టెంబరు 20న విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

'సాహో'తో పోటీ నుంచి తప్పుకున్న సూర్య
author img

By

Published : Aug 5, 2019, 12:58 PM IST

'గజిని','సింగం' సిరీస్​లతో గుర్తింపు పొందిన కోలీవుడ్​ స్టార్ హీరో సూర్య. యాక్షన్ థ్రిల్లర్​ 'బందోబస్తు' చిత్రంతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు. తమిళ సినిమా 'కాప్పన్​'కు తెలుగు అనువాదమిది. సాయేషా సైగల్​ హీరోయిన్​గా నటించింది. ఇతర పాత్రల్లో మోహన్​లాల్, ఆర్య కనిపించనున్నారు.

SURIYA IN BANDOBAST
సినిమాలోని ఓ సన్నివేశంలో సూర్య

ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 30న కాకుండా సెప్టెంబరు 20న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయంపై నెటిజన్ల ఆలోచన వేరే విధంగా ఉంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'సాహో' సినిమాకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారా, మరేదైనా కారణముందా అని చర్చించుకుంటున్నారు.

BANDOBAST RELEASE POSTER
బందోబస్తు విడుదల తేదీ పోస్టర్

ఇటీవలే వచ్చిన 'బందోబస్తు' టీజర్​లో వివిధ గెటప్పుల్లో సూర్య నటన, మోహన్​లాల్ డైలాగ్​లు, కథా నేపథ్యం సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. హరీశ్​ జైరాజ్​ స్వరాలు సమకూర్చాడు. 'రంగం' ఫేమ్​ కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్​ నిర్మాతగా వ్యవహరించింది.

ఇది చదవండి: 'కాప్పన్​' వేడుకలో సూర్య.. అతిథిగా రజనీకాంత్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.