దేశ ప్రధానిని రక్షించే అధికారిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు హీరో సూర్య. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో అతడు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'బందోబస్త్' సినీ అభిమానులను అలరిస్తోంది. తమిళంలో 'కాప్పాన్' పేరుతో విడుదలైంది. కోలీవుడ్‌లో విడుదల రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోందీ సినిమా.
తాజాగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించాడు. సూర్య-కె.వి.ఆనంద్‌లది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరూ కలసి చేసిన చిత్రాలు 'వీడోక్కడే', 'బ్రదర్స్' అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.
'బందోబస్త్' 100 కోట్ల వసూళ్లు సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ మూవీలో సూర్యతో పాటు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చూడండి.. ఆర్డీఎక్స్ సమీక్ష: గ్లామర్‌కే పరిమితమా..!