ETV Bharat / sitara

'డేగల బాబ్జీ' ట్రైలర్..​ 'స్పైడర్​ మ్యాన్'​ రిలీజ్​ డేట్​ - cinema updates telugu

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి(cinema updates telugu). ఇందులో 'డేగల బాబ్జీ' ట్రైలర్​ సహా 'ఆచార్య'9acharya movie), 'గుడ్​లక్​ సఖి', 'స్పైడర్​ మ్యాన్'​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Nov 8, 2021, 10:58 AM IST

Updated : Nov 8, 2021, 11:21 AM IST

నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైన బండ్ల గణేశ్‌ మొదటిసారి కథానాయకుడిగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు(bandla ganesh upcoming movies). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'డేగల బాబ్జీ'. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు(bandla ganesh latest news). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన 'డేగలబాబ్జీ' అనే వ్యక్తిగా బండ్ల గణేశ్‌ నటన ఆద్యంతం కట్టుకునేలా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తూ ఆయన పలికించిన హావభావాలు మెప్పించేలా ఉన్నాయి(bandla ganesh new movie as hero). "పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం", "అస్సలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా" అంటూ బండ్ల గణేశ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. యస్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై స్వాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆచార్య'(acharya movie). రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఈ చిత్రంలోని రెండో పాట విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. 'నీలాంబరి'(neelambari song acharya) అంటూ సాగే ఈ సాంగ్​ను రామ్​చరణ్​, పూజాహెగ్డేలపై తెరకెక్కించారు. మణిశర్మ బాణీలందించిన ఈ మెలోడీ సాంగ్​లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal movies)​, రామ్​చరణ్​కు(ram charan new movie) జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

'స్పైడర్​ మ్యాన్'(spider man release date) సిరీస్​లో భాగంగా రానున్న మూడో చిత్రం 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' విడుదల తేదీ ఖరారైంది. ఇంగ్లీష్​, తమిళం,తెలుగు, హిందీ భాషల్లో డిసెంబరు 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం(spider man no way home release date in india). టామ్ హోలండ్ టైటిల్​ రోల్​లో నటించారు.

spider man
స్పైడర్​ మ్యాన్​

కీర్తిసురేశ్ నటించిన 'గుడ్​లక్​ సఖి' సినిమా నుంచి 'బ్యాడ్​లక్​ సఖి' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషించారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. నవంబరు 26న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం(good luck sakhi release date).

ఇదీ చూడండి: రికీ ఛటర్జీ.. క్వీన్​ ఆఫ్​ ఫ్యాషన్​ ఇండస్ట్రీ

Last Updated : Nov 8, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.