ETV Bharat / sitara

'ఫైవ్​స్టార్'​ను కాదని ఆ చిన్న గదిలోనే బాలయ్య ఎందుకుంటారు? - entertainment news

ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో సినిమా చిత్రీకరణ అంటే హీరో బాలకృష్ణకు తార హోటల్​లోని ఆ గది కచ్చితంగా ఉండాల్సిందే. ఇంతకీ దాని వెనకున్న కథేంటి?

'ఫైవ్​స్టార్'​ను కాదని ఆ చిన్న గదిలోనే బాలయ్య ఎందుకుంటారు?
హీరో బాలకృష్ణ
author img

By

Published : Mar 16, 2020, 10:21 AM IST

కొన్ని విషయాల్ని కొందరు బలంగా నమ్ముతారు. వాటి వల్ల వారికి కెరీర్​ పరంగానైనా, జీవితంలోనైనా కలిసిరావొచ్చు. నటసింహం నందమూరి బాలకృష్టకు ఇలాంటి సెంటిమెంట్లు కాస్త ఎక్కువే అని దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అలాంటి ఓ సెంటిమెంటుకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదే "రూమ్​ నంబర్​ 610".

ఏంటీ రూమ్​ నంబర్​ 610?

అగ్ర హీరోల సినిమాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరగాల్సిందే. షూటింగ్​ సమయంలో నటులు చాలా మంది ఫిల్మ్​ సిటీలోనే బస చేస్తుంటారు. అది కూడా ఫైవ్​ స్టార్​ హోటల్​ సితారలో. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నం. ఆయన ఆ హోటల్​లో ఉండడట. పక్కనే ఉన్న త్రీ స్టార్​ హోటల్​ తారలో మాత్రమే బస చేస్తాడు. అది కూడా 610వ నంబర్​ గదిలో మాత్రమే.

బాలయ్య వచ్చే సమయానికి ఆ రూమ్​లో ఎవరైనా ఉంటే... వెంటనే ఖాళీ చేయాల్సిందే. ఈ విషయాలన్నీ రామోజీ ఫిల్మ్ సిటీ ఎగ్జిక్యూటివ్ షెఫ్ శివ చెప్పారు. ఎప్పుడూ దక్షిణాది భోజనాన్నే బాలయ్య ఇష్టపడతారని వెల్లడించారు. స్ట్రీట్​బైట్ అనే యూట్యూబ్​ ఛానెల్​లో చేసిన ఓ వీడియోలో ఈ ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం బాలకృష్ణ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈనెల 2 నుంచి షూటింగ్ ప్రారంభమై, ఇటీవలే తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'సింహా', 'లెజెండ్​' సినిమాలతో హిట్లు అందుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్​ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.