మహానటుడు, విశ్వవిఖ్యాత నందమూరి ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా.. గురువారం ఉదయం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు హీరో బాలకృష్ణ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అనంతరం సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు.
"జూన్ రెండో వారం నుంచి చిత్రీకరణలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. షూటింగ్లు తుదిదశకు వచ్చిన సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలని సూచించాం. జీవో వచ్చాక సినిమాల చిత్రీకరణలు ప్రారంభమవుతాయి" అని బాలకృష్ణ తెలిపారు.