ETV Bharat / sitara

తండ్రికి తగ్గ తనయుడు.. నందమూరి నట సింహం - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు

'తాతమ్మ కల'తో తెలుగుతెరకు పరిచయమై..ప్రేక్షకులందరినీ తన నటనతో మెప్పించిన హీరో బాలకృష్ణ. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణపై ప్రత్యేక కథనం.

గోపాలబాలకృష్ణ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
author img

By

Published : Jun 10, 2019, 6:10 AM IST

Updated : Jun 12, 2019, 1:10 PM IST

తొడ కొడితే రికార్డులు... డైలాగులు చెబితే ఈలలు.. తెలుగు తెరపై కలెక్షన్​ సునామీలు. ఈ ముక్క తెలుగు గడ్డపైన ఏ బిడ్డనడిగినా చెబుతాడు.. అది బాలకృష్ణ అని. ఇలా తెలుగు వాడి గుండెల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. నేడు 'లెజెండ్'​ పుట్టినరోజు సందర్భంగా నందమూరి నట సింహంపై ఓ లుక్కెద్దాం!

అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుస్తారు. కథ పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా.. తండ్రి నందమూరి తారక రామారావులా ఇట్టే ఒదిగిపోగల నటుడు బాలకృష్ణ. 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు. 1982లో వసుంధర దేవిని వివాహం చేసుకున్నారు.

సినీ ప్రస్థానం..

1974లో ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ‘సాహసమే జీవితం’, ‘జననీ జన్మభూమి’, ‘మంగమ్మగారి మనవడు’ చిత్రాలతో హీరోగా మంచి విజయాలందుకున్నారు. ‘అపూర్వ సోదరుడు’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘నారీనారీ నడుమ మురారీ’లాంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

విభిన్న తరహా సినిమాలకు నాంది..

లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహా, చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్ లాంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి చిత్రాలతో ప్రయోగాలకు పెద్దపీట వేశారు. ‘శ్రీరామరాజ్యం’, ‘పాండురంగడు’ వంటి భక్తిరస చిత్రాలతో అలరించారు. అక్బర్ సలీమ్ అనార్కలీ, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బయోపిక్​ ట్రెండ్​లో కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో నటించి తండ్రి నందమూరి తారక రామారావు ఔన్నత్యాన్ని తెలుగువారికి మరోసారి చూపించారు.

భవిష్యత్​ ప్రాజెక్టులు..

కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. తనయుడు మోక్షజ్ఞని పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

అవార్డులు..

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 100కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు బాలయ్య. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు, నరసింహనాయుడు (2001), సింహా (2010), లెజెండ్‌ (2014) సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి '

'నంది' అవార్డులు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం..

రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారు బాలకృష్ణ. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
డ్యాన్సులతో అభిమానుల్ని అలరించే బాలకృష్ణ... పోరాట ఘట్టాల్లోనూ డూప్‌ లేకుండా నటిస్తుంటారు. తన 44 ఏళ్ల నట జీవితంలో మరపురాని చిత్రాలెన్నో చేశారు. ఒక పక్క మాస్‌ కథానాయకుడిగా అభిమానుల్ని అలరిస్తూనే, నటుడిగా స్ఫూర్తిదాయక పాత్రల్లో నటించారు బాలయ్య.

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 9 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1826: Kazakhstan Polls Close AP Clients Only 4214985
Polling stations close in Kazakhstan elections
AP-APTN-1821: Hong Kong Tension 2 AP Clients Only 4214984
Hong Kong police struggle to disperse protesters
AP-APTN-1751: Moldova Politics 2 No access Moldova 4214983
Moldova political crisis escalates further
AP-APTN-1739: At Sea Israel Ship AP Clients Only 4214982
Israel naval forces board blazing ship off Haifa
AP-APTN-1735: Hong Kong Tension AP Clients Only 4214981
Tense scenes in Hong Kong following mass protest
AP-APTN-1732: UAE German FM AP Clients Only 4214978
German and UAE FMs on Gulf tensions, Iran
AP-APTN-1731: US Sunday Shows Part must credit Fox News Sunday; Part must credit ABC This Week; No access US 4214980
US political reax to Mexico tariffs developments
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 12, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.