నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందడి అప్పుడే మొదలైంది. ఈనెల 10న ఈ హీరో బర్త్డే చేసుకోనున్నారు. అయితే దీనికి సంబంధించిన కామన్ డీపీని 50 మంది ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్, హీరోలు రాజశేఖర్, శ్రీకాంత్, నారా రోహిత్, హీరోయిన్లు వేదిక, మెహ్రీన్ ఫిర్జాదా, నటాషా దోషి, హంస నందినితో పాటు బాలయ్య కూతురు బ్రాహ్మిణి, అల్లుడు లోకేశ్ నారా విడుదల చేసిన వారిలో ఉన్నారు.
ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఈ హీరో రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నారని సమాచారం.