ETV Bharat / sitara

విష్ణు విశాల్-షట్లర్ గుత్తా జ్వాల పెళ్లి తేదీ ఫిక్స్​ - గుత్తా జ్వాల విష్ణు విశాల్ పెళ్లి

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ పెళ్లి ముహూర్తం ఏప్రిల్​ 22న ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు విశాల్​.

Badminton star Jwala Gutta and actor Vishnu Vishal
షట్లర్ గుత్తా జ్వాల-విష్ణు విశాల్
author img

By

Published : Apr 13, 2021, 3:10 PM IST

బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల-తమిళ నటుడు విష్ణు విశాల్​ పెళ్లి తేదీ ఖరారైంది. ఈ నెల 22న వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని విష్ణు ఇన్​స్టా ద్వారా తెలిపారు. తమ పెళ్లిపత్రికను పోస్ట్​ చేసి.. కుటుంబం సమక్షంలో తమ వివాహం జరగబోతున్నట్లు వెల్లడించారు.

కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జోడీ, గతేడాది సెప్టెంబర్​లో నిశ్చితార్థం చేసుకున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విష్ణు గతంలో రజనీ నటరాజన్​ను వివాహం చేసుకోగా.. వారికి ఆర్యన్​ అనే అబ్బాయి పుట్టాడు. 2018లో ఆ జంట విడాకులు తీసుకుంది. కాగా గుత్తా జ్వాల.. చేతన్​ ఆనంద్​ను వివాహమాడగా.. 2011లో ఇరువురి మనసులు కలవక విడిపోయారు.

తమిళ చిత్రాలు 'రాట్ససన్', 'కబాడీ కుజు', 'నీరపర్వై'​తో విష్ణు విశాల్​ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రానా నటించిన 'అరణ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదీ చూడండి: హీరో విశాల్​తో గుత్తాజ్వాల డేటింగ్.. ఫొటోలు వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.