ETV Bharat / sitara

నేను దేవుడ్ని కాదు: సోనూ ఆత్మకథ త్వరలో విడుదల - సోనూసూద్​ ఆటోబయోగ్రఫీ

లాక్​డౌన్​ వేళ వలసకూలీల వెతలకు చలించిన సోనూసూద్​.. వారందరినీ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. ఆ అనుభవాల ఆధారంగా రాస్తున్న తన ఆత్మకథను.. డిసెంబరులో విడుదల చేయనున్నారు.

Sonu Sood's autobiography to be titled 'I Am No Messiah'
'నేను దేవుడ్ని కాదు' అంటున్న సోనూసూద్​
author img

By

Published : Nov 12, 2020, 12:33 PM IST

లాక్​డౌన్​లో వలసకూలీల పాలిట దేవుడిలా మారిన నటుడు సోనూసూద్​.. ఎంతోమందిని వారివారి స్వస్థలాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన జీవితం ఆధారంగా పుస్తకం రాస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దానికి 'నేను దేవుడ్ని కాదు(ఐయామ్​ నో​ మెసాయ్)' పేరుతో తీసుకురానున్నారు. ప్రచురణ సంస్థ పెంగ్విన్​ ర్యాండమ్ హౌస్​ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మహమ్మారి కాలంలో సోనూ చూసిన ప్రజల కష్టాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రచిస్తున్నట్లు తెలిపారు. మీనా అయ్యర్​తో కలిసి ఈ పుస్తకాన్ని​ రాస్తున్నారు సోనూ​.

"ప్రజలు నన్ను దేవుడు అని ప్రేమతో పిలుస్తున్నారు. కానీ, నిజంగా దేవుడిని కాదు. నా మనసు ఏం చెప్పిందో... అది మాత్రమే చేశాను. ఆపదలో ఇతరులకు ఆసరాగా నిలవడం మానవులగా మన బాధ్యత"

-- సోనూసూద్​, నటుడు

లాక్​డౌన్​లో వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సోనూ.. వారిని ఇళ్లకు చేర్చారు. అప్పటినుంచి ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసినా తానున్నానంటూ ఆదుకున్నారు. తనకొస్తున్న వినతుల పరిష్కారానికి ఓ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఈ అనుభవాలనే సోనూ తన పుస్తకంలో వివరించనున్నారు. వారివల్ల తన జీవితార్థం ఎలా మారిపోయిందో తెలపనున్నారు.

ఇదీ చూడండి:వలసకూలీల పాలిట దేవుడు సోనూసూద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.