ETV Bharat / sitara

లక్ష్యాలేమీ లేవు.. అదొక్కటి చేస్తే చాలు: రకుల్​ - కొండపొలం

ప్రేక్షకులు(Kondapolam movie) జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఓ సినిమా చేయాలని అనుకున్నట్లు తెలిపింది హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్(vaishnav tej rakul preet singh)​. ప్రస్తుతం తాను నటించిన 'కొండపొలం' చిత్రాన్ని అలానే ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పింది. అక్టోబర్​ 8న విడుదల కానుందీ మూవీ.

rakul
రకుల్​
author img

By

Published : Oct 7, 2021, 7:05 AM IST

"నిజ జీవితంలో నేనెలా కనిపిస్తానో(Kondapolam movie).. తెరపైనా అలాంటి పాత్రలే చేయాలంటే నచ్చదు. చేసే ప్రతి పాత్ర నటిగా నన్ను సరికొత్తగా ఆవిష్కరించేదై ఉండాలి. ప్రేక్షకులకు నన్ను కొత్తగా పరిచయం చేయాలి" అంటోంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(kondapolam movie release date). గ్లామర్‌ పాత్రలతో మురిపించడంలోనూ.. నటనా ప్రాధాన్య పాత్రలతో అలరించడంలోనూ తనదైన ముద్ర వేసే నాయిక రకుల్‌. దక్షిణాదిలో అగ్ర నాయికగా తళుకులీనుతున్న ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ఇప్పుడామె వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా నటించిన చిత్రం 'కొండపొలం'. క్రిష్‌ తెరకెక్కించారు(kondapolam movie director). ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్​ 8) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది రకుల్‌(vaishnav tej rakul preet singh). ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలాంటి సినిమా చేయాలి..

"ఫలానా పాత్రలు చేయాలని లక్ష్యాలేమీ లేవు. మనం ఒక్క సినిమా చేస్తే.. అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటా. ఒక 'దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే', ఓ 'బాహుబలి' సినిమాల్లా అనమాట. అలాంటి చిత్రాల జాబితాలో 'కొండపొలం'(kondapolam movie cast) ఉంటుందని నమ్ముతున్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'అటాక్‌', 'మేడే', 'థ్యాంక్‌ గాడ్‌', 'డాక్టర్‌ జి'లతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నా. వచ్చే ఏడాది నా నుంచి మొత్తం ఆరు చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం తెలుగులోనూ కొన్ని కథలు వింటున్నా. నేను 'కరణం మల్లీశ్వరి' బయోపిక్‌ చేయడం లేదు.

ఓబులమ్మ నాకెంతో ప్రత్యేకం..

"నేను గతంలో 'కరెంటు తీగ', 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'ఖాకీ'.. ఇలా కొన్ని సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించాను(kondapolam movie heroine). ఈ చిత్రంలో పోషించిన ఓబులమ్మ పాత్ర చాలా ప్రత్యేకం. నేనిందులో గొర్రెలు కాసే అమ్మాయిగా కనిపిస్తా. నా లుక్‌, నా భాష, యాస.. అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ పాత్ర ప్రేక్షకులకీ ఎంతో బాగా నచ్చుతుంది. ఈ చిత్రం కోసం రాయలసీమ యాసలో మాట్లాడేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమా కోసం వైష్ణవ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. తన కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వైష్ణవ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. ఎక్కడా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఉండదు. చాలా ఒదిగి ఉంటాడు. తనలో నేర్చుకోవాలనే తపన ఉంది".

సవాళ్లతో కూడుకున్నది

"అటవీ నేపథ్యంలో సాగే ఇలాంటి సినిమాలు చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ, షూట్‌ చేయడం చాలా కష్టం(kondapolam story). ఎన్నో సవాళ్లు ఉంటాయి. మామూలుగా అడవిలో నడుస్తూ వెళ్లడమే కష్టంగా అనిపిస్తుంటుంది. అలాంటిది.. పెద్ద పెద్ద కెమెరాలు మోసుకుంటూ షూటింగ్‌ స్పాట్‌కు నడిచి వెళ్లడమంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం వికారాబాద్‌ ఫారెస్ట్‌లో జరిగింది. లాక్‌డౌన్‌ వల్ల చాలా రోజులు ఇంట్లో ఉండిపోయాం కదా.. ఆ తర్వాత వెంటనే అడవిలో షూటింగ్‌ అంటే చాలా ఆనందంగా అనిపించింది. మా కారవ్యాన్‌లు రోడ్డు దగ్గర్లో ఉంచేవారు. అక్కడి నుంచి లోపలికి రెండు కిలోమీటర్లు నడిస్తే షూటింగ్‌ స్పాట్‌కు చేరుకునేవాళ్లం. ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లోనే పూర్తి చేశాం. ఇదంతా క్రిష్‌ ఆలోచనా విధానం వల్లే సాధ్యమైంది. ఎప్పుడైనా వర్షం పడితే.. అప్పటికప్పుడు ఆ వర్షంలో ఉన్న సీన్స్‌ను తెరకెక్కించే వారు. నాకు తెలిసి ఇండియన్‌ సినిమాలో ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇదొక 'మినీ జంగిల్‌ బుక్‌' లాంటి సినిమా".

ఛాలెంజింగ్‌గా ఉంటేనే..

"పాటలు, కొన్ని(kondapolam music director) సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఏ పాత్రయినా సరే.. నాకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తేనే చేస్తా. 'కొండపొలం'లోని ఓబులమ్మ పాత్ర నాకలాగే సవాల్‌గా అనిపించింది. అందుకే క్రిష్‌ కథ చెప్పగానే చేస్తానని చెప్పా. హిందీలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు.. తెలుగులో చేయట్లేదు అనే మాటల్ని నేను ఒప్పుకోను. మనసుకు నచ్చిన పాత్రలు వస్తే.. తప్పకుండా ఎక్కడైనా చేస్తా. ఓటీటీలో అద్భుతమైన కంటెంట్‌ వస్తోంది. మంచి వైవిధ్యభరితమైన కథ దొరికితే.. కచ్చితంగా ఓటీటీ ప్రాజెక్ట్‌లలోనూ నటిస్తా. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి కానీ, ఇలాంటి కథలేవీ దొరకలేదు".

ఇదీ చూడండి:

అందుకే 'కొండపొలం' సినిమా చేశాం: క్రిష్​

ఆ పాత్రలో నటించడం మరిచిపోలేని అనుభూతి: రకుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.