నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ కలిసి నటించిన ప్రేమకథా చిత్రం 'నిన్ను కోరి'. దర్శకుడు శివ నిర్వాణకు ఇది తొలి సినిమానే అయినా, ప్రేక్షకుల్ని తన ప్రతిభతో కట్టిపడేశాడు. తెలుగులో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు చూపించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాని పాత్రలో అధర్వ మురళి, నివేదా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారని టాక్.
మాతృకలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించాడు. మరి రీమేక్‌లో అతడి పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి. తమిళంలోనే కాకుండా కన్నడలోనూ రీమేక్ చేయనున్నారట. త్వరలో వీటిపై స్పష్టత రానుంది.
![Nani Ninnu kori movie remake in tamil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6488214_th.jpg)
ఇదీ చూడండి : రజనీకాంత్ కొత్త సినిమాకు దర్శకుడిగా లారెన్స్?