ETV Bharat / sitara

''నువ్వే కావాలి' నన్ను ఆర్థికంగా ఆదుకుంది'

author img

By

Published : Oct 11, 2020, 3:10 PM IST

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్​ కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

nuvve kaavali
నువ్వే కావాలి
'నువ్వే కావాలి'

హీరో తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్​, చిత్రవిశేషాలు కొన్నింటిని వెల్లడించారు.

"ఇప్పటివరకు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా థియేటర్లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా నిలిచిపోతుంది. ఆ రోజుల్లోనే 3కోట్లకు పైగా మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. అయితే ఈ చిత్రానికి మాతృక మలయాళ సినిమా 'నిరం'. దీన్ని చూడగానే చాలా బాగుందనిపించింది. తెలుగులో బాగా ఆడుతుందని భావించి దర్శకుడు విజయ్​ భాస్కర్​కు ఫోన్​ చేసి ఈ సినిమా చేద్దామని అడిగా. వెంటనే సరే అన్నాడు. అంతకుముందే తనతో కలిసి పనిచేసిన త్రివిక్రమ్​ను కూడా కలుపుకుందాం అన్నాడు. నేను అంగీకరించా. అయితే ఈ సినిమాలో సూపర్​ హిట్​ మెలోడీ సాంగ్​ 'అనగనగా ఆకాశం ఉంది' పాట కోసం 400మంది జూనియర్​ ఆర్టిస్టులతో, నాలుగు రోజులు పాటు చిత్రీకరించాలి. చాలా డబ్బుతో కూడుకున్న పని. నేను అప్పట్లో ఆర్థికంగా బాగోలేను. అప్పడు రామోజీరావు గుర్తుకువచ్చారు. తక్షణమే ఆయనను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించా. ఆయన మాపై నమ్మకం ఉంచి మాకు సహకరించారు. అలా సినిమాను తెరకెక్కించడం, సూపర్​ హిట్​గా నిలవడం అంతా జరిగిపోయాయి. ఈ చిత్రం ఆర్థిక సమస్యలు నుంచి నన్ను బయటపడేసింది. మొత్తంగా ఈ సినిమా వల్ల హీరో తరుణ్​, రిచా, త్రివిక్రమ్​కు​ మంచి పేరు వచ్చింది. నా జీవితంలోనే ఈ సినిమా ఓ మైలురాయి" అని రవికిశోర్​ మనుసులోని మాటలను పంచుకున్నారు.

ఇదీ చూడండి అమితాబ్​కు చిరు విషెస్.. 'ప్రతిభకు పవర్​హౌస్' అని ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.