స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్.. ముద్దుగుమ్మ కిమ్ శర్మతో రిలేషన్లో ఉన్నాడా? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ గోవాలో విహరిస్తుండటమే ఇందుకు కారణం. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోయింది!
ముంబయిలోని పైలేట్స్ స్టూడియో దగ్గర ఏడాది క్రితం మే నెలలో పేస్, కిమ్ శర్మ కనిపించారు. అయితే వర్కౌట్లు చేసుకునేందుకు వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫొటోలు చూస్తుంటే వారిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.
పేస్-రియా వివాదం
టెన్నిస్ ప్లేయర్ పేస్.. మోడల్ రియా పిల్లాయితో పదేళ్లపాటు రిలేషన్లో ఉన్నాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది. తనను పేస్ మోసం చేశాడని, రియా అతడిపై ఆరోపణలు కూడా చేసింది.
హర్షవర్ధన్‌తో కిమ్
కిమ్ శర్మ కూడా నటుడు హర్షవర్ధన్ రాణాతో రిలేషన్లో ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
కిమ్ శర్మ.. తెలుగులో 'ఖడ్గం', 'యాగం' సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. 'మగధీర', 'ఆంజనేయులు' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది.
ఇవీ చదవండి: