తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎమ్జీఆర్ పాత్రలో 'రోజా' హీరో అరవింద్ స్వామి నటించనున్నారట. ఎమ్జీఆర్ 1977 నుంచి 1987 వరకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది.
చిత్రానికి 'తలైవా' లేదా 'జయ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సినిమాకు విజయ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా వల్ల కంగనా - అరవింద్ తొలిసారిగా కలిసి పనిచేయనున్నారు. కంగనా ఈ చిత్రం కోసం తమిళ భాషతో పాటు భరతనాట్యమూ నేర్చుకుంటుందట. ఎందుకంటే జయలలితకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. తెలుగులో నేరుగా వచ్చిన అరవింద్ స్వామి చిత్రం 'మౌనం' (1995). ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి 'ధృవ'లో ప్రతినాయకుడిగా కనిపించాడు.
ఇవీ చూడండి.. ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్