'అరణ్య' తన కెరీర్‌లోనే అతి క్లిష్టమైన సినిమా అని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'అరణ్య'. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించారు. ఇందులో రానా ఏనుగుల సంరక్షకుడిగా, ఓ ఆదివాసీ పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా గురించి రానా స్పందించారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పారు.
"బాహుబలి' నా జీవితాన్ని మార్చడం సహా భారతీయ సినిమా స్థాయినీ పెంచింది. సినిమా విషయంలో ప్రతి ఒక్కరికీ ఉన్న ఆలోచనలను మార్చింది. తెరకెక్కించే విధానంలో సైతం ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. దాని తర్వాత నేను నటించిన విభిన్న కథా చిత్రం 'అరణ్య'. అయితే ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో ఇది ఎంతో క్లిష్టమైనది. ఏనుగు తొండం బరువును ప్రతిసారీ నా భుజాలపై మోయాల్సివచ్చేది. ఆ బరువు దాదాపు 160, 170 కిలోలు ఉంటుంది. అయితే నేను నటించిన ప్రతి సినిమా నా జీవితానికి ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది' అని రానా పేర్కొన్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'అరణ్య' చిత్రం విడుదల కానుంది. ఇందులో విష్ణువిశాల్, పుల్‌కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 2వ తేదీన రావాల్సి ఉన్నా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">