ETV Bharat / sitara

సంగీత రత్నాకరం.. ఏఆర్​ రెహమాన్

కర్ణాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రదాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగిన సంగీత విద్వాంసుడతడు. వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టే సమర్థుడతడు. ఆయన గొంతు మధురం.. ఆయన సంగీతం సుమధురం. ఆయనే ఏ ఆర్ రెహమాన్. గోల్డెన్​ గ్లోబ్​ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడనే ఘనత ఆయనకే సొంతం కావడం విశేషం.

A R Rehman
సంగీత రత్నాకరం...ఏ ఆర్​ రెహమాన్
author img

By

Published : Jan 6, 2021, 5:30 AM IST

రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. చిన్నతనంలోనే తండ్రి మరణించగా.. కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి అందించిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

ఆయన రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు పొందారు.

జీవితం

రెహమాన్ తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్​కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. నాలుగేళ్ళ వయసు నుంచే రెహమాన్ తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి.

A R Rehman
కుటుంబ సభ్యులతో రెహమాన్

ఈ తరుణంలో... 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు రెహమాన్. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.

  • పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేకపోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లో కూడా రెహమాన్​కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.
  • తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితురాలైంది. తర్వాత వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది.
  • ఇది జరగక మునుపే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది.

సంగీత ప్రస్థానం

  • సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్​కు మంచి స్నేహితుడు కూడా.
  • తన సంగీత జీవితాన్ని రాజ్ - కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా 'రోజా' ద్వారా మంచి పేరు సంపాదించాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు.
  • "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహమాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవమని అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహమానే.
  • రెహమాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని... తనకు రెహమాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహమాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రదాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహమాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.
    A R Rehman
    సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్

బిరుదులు

టైమ్ మ్యాగజైన్ రెహమాన్‌ కు 'మొజార్ట్ ఆఫ్ మద్రాస్' బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్​కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహమాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు.

2005 లో టైం మ్యాగజిన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశోలులైన వ్యక్తుల్లో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

తెలుగు చిత్రాలు:

గ్యాంగ్ మాస్టర్

సూపర్ పోలీస్

నిప్పు రవ్వ (నేపథ్య సంగీతం మాత్రమే)

ప్రేమ దేశం

రక్షకుడు

రోజా

జెంటిల్ మాన్

జీన్స్

సఖి

నీ మనసు నాకు తెలుసు

నానీ

పులి

రోబో

నువ్వు నేను ప్రేమ

హిందీ చిత్రాలు:

రంగీలా

తాళ్

స్వదేశ్

లగాన్

రంగ్ దె బసంతి

గురు

జోధా అక్బర్

గజని

అదా

రోబో

నాయక్

బాయ్స్

సంగీత పాఠశాల....

తన స్వంత సంగీత పాఠశాల "కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ"ని 9 ఆగస్టు, 2013న రంజాన్ పర్వదినాన ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవంలో ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ... సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపాడు.

ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహమాన్ చెప్పాడు. తాము స్థాపించిన ఈ సంగీత కళాశాల సినిమా, వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహమాన్ చెప్పాడు.

సంగీత శిక్షణలో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునే వారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ పాల నవ్వులల్లో 'వెన్నెల'మ్మ.. ఓ సారి వద్దకొచ్చి వెళ్లవమ్మా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.