ETV Bharat / sitara

షారుక్​‌- అట్లీ సినిమాకు రెహమాన్‌ సంగీతం! - ఏ ఆర్​ రెహమాన్​ షారుక్​ అట్లీ

బాలీవుడ్ బాద్​షా​ షారుక్​ ఖాన్​- తమిళ స్టార్​ దర్శకుడు అట్లీ కాంబోలో రానున్న సినిమాకు ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందించనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ar rahaman music for sharukh atlee movie
షారుక్​‌- అట్లీ
author img

By

Published : Oct 8, 2020, 4:27 PM IST

చిన్న వయసులోనే ఘన విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు అట్లీ. షారుక్​ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం శంకి (వర్కింగ్​ టైటిల్​)పేరుతో రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్‌.రెహమాన్‌ అయితే బాగుంటుందని అట్లీ భావిస్తున్నారట. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో షారుక్​ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. అందులో ఒకటి పోలీస్ అధికారిగా కాగా.. మరొకటి క్రిమినల్‌ పాత్ర.

షారుక్‌ 2018లో విడుదలైన 'జీరో' చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు. దీంతో అట్లీ తెరకెక్కించబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదీ చూడండి షూటింగ్ రీస్టార్ట్: బీచ్​ దగ్గర రాఖీభాయ్.. పొలంలో శర్వానంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.