మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా గురించి ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఇందులో అనుష్క ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనుందని సమాచారం.
అనుష్క ఈ చిత్రంలో కనిపించదని కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చిందని మొదట వార్తలొచ్చాయి. ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిగా సినిమా ప్రథమ, ద్వితీయార్థాలలో దాదాపు 10 నిమిషాల సేపు ఆమె సందడి చేస్తుందట. సినిమాలో స్వీటీ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, కిచ్చా సుదీప్ కీలక పాత్రలు పోషించారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: టీజర్: 'చాణక్య'లో గూఢచారిగా గోపీచంద్