ETV Bharat / sitara

'18 పేజీస్​'లోకి 18వ రోజు వచ్చిన అనుపమ! - anupama parameswaran latest news

తన కొత్త సినిమా షూటింగ్ తిరిగి మొదలైన 18వరోజున సెట్​లోకి అడుగుపెట్టానని హీరోయిన్ అనుపమ చెప్పింది. సెట్​లో సిబ్బంది చేసిన అల్లరికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

anupama parameswaran in 18 pages shooting
'18 పేజీస్​'లోకి 18వ రోజు వచ్చిన అనుపమ!
author img

By

Published : Dec 5, 2020, 7:00 AM IST

'18 పేజీస్‌' సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది నటి అనుపమ పరమేశ్వరన్‌. యాదృచ్ఛికంగా ఈ చిత్రం తిరిగి ప్రారంభమైన 18వ రోజునే తానూ సెట్స్‌లోకి అడుగుపెట్టానని తెలిపింది. నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

anupama parameswaran in 18 pages shooting
'18 పేజీస్​' సెట్​లో నిఖిల్, అనుపమ

ఇటీవల షూటింగ్ తిరిగి ప్రారంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి అనుపమ అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. "18 పేజీస్‌' సెట్‌లో నేను 18వరోజు అడుగుపెట్టా. ఎందుకో నాకు మునుపెన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది" అని రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా సెట్లోని సిబ్బంది చేసిన అల్లరిని వీడియోల రూపంలో అభిమానులతో పోస్ట్ చేసింది. ఓ విభిన్నమైన ప్రేమకథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. బన్నీవాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.