పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హిందీలో విజయం అందుకున్న 'పింక్'కు రీమేక్‌గా రూపొందుతుంది. ఇటీవలే ప్రారంభమైందీ సినిమా. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ సరసన నటించే నాయిక ఎవరో తెలియలేదు. కానీ, చిత్రసీమలో చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
తెలుగు 'పింక్' అవకాశం ఈ నాయికకే అంటూ నయనతార, సమంత, పూజా హెగ్డే, నివేదా థామస్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి నిన్నటి వరకు. తాజాగా ఈ జాబితాలో తెలుగమ్మాయి చేరింది. ఈ నటి ఎవరో కాదు.. అంజలి. పవన్‌కు జోడిగా అంజలి నటించబోతుందంటూ టాలీవుడ్ టాక్. ఈ సందేహానికి సమాధానం తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు