ఈ మధ్య కాలంలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ కరోనా ప్రభావం, థియేటర్ల మూసివేత కారణంగా వాయిదా పడుతున్నాయి. వాటి కొత్త రిలీజ్ తేదీలపైనా సందిగ్ధత ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది అనసూయ 'థాంక్యూ బ్రదర్'.
ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. 'ఆహా'లో ఇప్పుడు మే 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటించడం సహా పోస్టర్‌ను విడుదల చేశారు.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఓ గర్భిణి, యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారు? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇది చదవండి: ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా