న్యూఇయర్ వేడుకల కోసం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మాల్దీవులకు వెళ్లారు. అక్కడి బీచ్‌లో బికినీతో ఫోజులిస్తూ ఆమె దిగిన కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే, ఈ నూతన సంవత్సర వేడుకల కోసం యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి అనన్య విహారయాత్రకు వెళ్లారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డిసెంబరు 29న వీరిద్దరూ కలిసి ముంబయి విమానాశ్రయం నుంచి మాల్దీవులకు బయలుదేరారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ విషయం వారిద్దరి సోషల్‌మీడియా ఖాతాలు పరిశీలిస్తే తెలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇషాన్ ఖట్టర్, అనన్య పాండేలు కలిసి 'కాలీ పీలీ' చిత్రంలో కలిసి నటించగా.. ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా చిత్రీకరణలో వీరిద్దరూ దగ్గరైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలో అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: టాలీవుడ్ నుంచి న్యూఇయర్ అప్డేట్స్!