భారత సినీరంగంలో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నటుడు అమితాబ్ బచ్చన్. ఈ బాలీవుడ్ మెగాస్టార్.. ప్రస్తుతం కోట్లాది రూపాయలు పారితోషకం తీసుకుంటూ అగ్రనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. కానీ, ఇదే బిగ్‌బీ ఒకప్పుడు రెండు రూపాయలు లేక ఇబ్బంది పడ్డారట. ఇటీవలే జరిగిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పాల్గొన్న ఓ పోటీదారు.. "చిన్నప్పుడు నాకిష్టమైన తినుబండారం కొనుక్కోడానికి రూ.7 అవసరమైతే, మా అమ్మ రూ.5 ఇచ్చింది" అని చెప్పారు. అప్పుడు అమితాబ్ సైతం తన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు.
"నా చిన్నప్పుడు స్కూల్ క్రికెట్ టీమ్‌లో చేరాలనుకున్నా. దానికి రెండు రూపాయలు అవసరమయ్యాయి. అమ్మని అడిగితే లేవని చెప్పింది. అందుకే ఇప్పటికీ రెండు రూపాయల విలువ ఏంటో నాకు తెలుసు."
అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటుడు
అదే సమయంలో తనకు తన తండ్రి ఇచ్చిన బహుమతి గురించి కూడా గుర్తు చేసుకున్నారు బిగ్‌బీ. "నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నాన్న తొలిసారి రష్యాకు వెళ్లినప్పుడు కెమెరా తీసుకొచ్చారు. అది ఇప్పటికీ నా వద్దే ఉంది." అని పేర్కొన్నారు.