ETV Bharat / sitara

ఆసుపత్రి సౌకర్యాలపై బిగ్​బీ వీడియో వైరల్​ - latest amitab bachan corona news

ఇటీవలే కరోనా పాజిటివ్​గా తేలిన బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​.. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం గురించి స్పందించిన వీడియో వైరల్​గా మారింది.

Amitabh Bachchan's April video goes viral, Nanavati Hospital issues statement
అమితాబ్​ బచ్చన్​
author img

By

Published : Jul 13, 2020, 5:44 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ శనివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే తాను నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బిగ్​బీ పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రిలోని సౌకర్యాలు, పరిస్థితుల గురించి బిగ్​బీ​ వివరిస్తున్న వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇందులో కష్ట సమయాల్లో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు అమితాబ్.

"నానావతి ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బంది అందరితో మాట్లాడాలనుకుంటున్నా. ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవ అద్భుతమైనది. త్వరలోనే ఈ పరిస్థితుల నుంచి బయటపడతామనే నమ్మకం నాకుంది. నేను ఎప్పుడు నానావతి ఆసుపత్రికి వచ్చినా సిబ్బంది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు."

-అమితాబ్​ బచ్చన్​ , సినీ నటుడు

అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని స్పష్టమైంది. ఏప్రిల్​లో కరోనా యోధులను అభినందిస్తూ.. బిగ్​బీ పోస్ట్​ చేసినట్లుగా తేలింది.

ఇదీ చూడండి:అమితాబ్, అభిషేక్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.