ETV Bharat / sitara

ఆ​ యాడ్​ నుంచి వైదొలిగిన బిగ్​బీ.. కారణమేంటంటే? - అమితాబ్​ బచ్చన్​ బర్త్​డే

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan Pan Masala).. తాను ప్రచారం చేస్తున్న ఓ ప్రకటన నుంచి తప్పుకొన్నారు. అసలెందుకు వైదొలిగారో తెలుసా?

big
బిగ్​ బీ
author img

By

Published : Oct 11, 2021, 12:56 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​(Amitabh Bachchan Pan Masala) ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రచారం చేస్తున్న పాన్​ మసాలా వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకొన్నారు. ఆ యాడ్​లో నటించినందుకు ఆయన తీసుకున్న డబ్బును కూడా సదరు సంస్థకు తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని 'ది ఆఫీస్​ ఆఫ్​ మిస్టర్​ అమితాబ్​ బచ్చన్​' బ్లాగ్​లో పోస్ట్​ చేసింది.

"వాణిజ్య ప్రకటన (pan masala amitabh) ప్రసారమైన కొన్ని రోజుల తర్వాత గత వారం సదరు సంస్థను కలిశారు అమితాబ్. ఆ తర్వాత ప్రచారం నుంచి తప్పుకొన్నారు. బిగ్​బీకి.. అది బ్యాన్​ అయిన ప్రొడక్ట్​ అని తెలియక ప్రమోషన్​ చేశారు. అది తెలుసుకున్నాక సదరు సంస్థతో సంప్రదింపులు జరిపి ప్రమోషన్​ కోసం తాను తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశారు. "

-బిగ్​ బీ ఆఫీస్​.

గత నెల నేషనల్​ యాంటీ టొబాకో అనే స్వచ్ఛంద సంస్థ(National Anti-Tobacco Program).. పాన్​ మసాలాను ప్రచారం చేస్తున్న వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకోవాలని అమితాబ్​ను కోరింది(Amitabh Bachchan Pan Masala). ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బిగ్​బీ ప్రమోషన్​ నుంచి తప్పుకొన్నారు.

స్టైలిష్​ లుక్​లో బిగ్​బీ.. ఫొటో వైరల్​

అమితాబ్​ బచ్చన్(Amitab bachan birthday)​.. ఈ పేరు తెలియని వారుండరు. వెండితెరపై తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన(amitab movie list).. బుల్లితెరపై కూడా చాలా కాలం నుంచి అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా తనదైన నటన, స్టైల్​తో ఆకట్టుకుంటున్నారు. నేడు(అక్టోబర్​ 11) బిగ్​బీ పుట్టినరోజు(big b birthday wishes). ఈ సందర్భంగా 80ఏట అడుగుపెడుతున్నట్లు తనకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్​ చేశారాయన. ఈ ఫొటోలో బిగ్​బీ ట్రెండీ లుక్​ అదిరిపోయింది. ఆకట్టుకునే డ్రెస్​, పచ్చ రంగు షూస్​ వేసుకుని, స్టైలిష్​ స్లింగ్​ బ్యాగ్స్​ను భుజానికి తగిలించుకుని నడుస్తూ కనిపించారు.

అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు బిగ్​బీ స్టైలిష్​ అవతార్​ను చూసి ఫిదా అయిపోయారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెట్టారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: Big B Birthday: యాంగ్రీ యంగ్ మ్యాన్​ చిన్ననాటి ఫొటోలు చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.