బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం తన అభిమానులతో సమావేశం కాలేకపోయారు. గత 38 ఏళ్లుగా.. ప్రతి ఆదివారం జల్సా హౌస్‌లో తన అభిమానులను కలుసుకుని పలకరిస్తుంటారు బిగ్‌బీ. అయితే ఈ సారి కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాన్ని నిలిపేశారు.
దీనిపై బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఆదివారం శూన్యం ఆవరించిందని పేర్కొన్నారు. "శ్రేయోభిలాషుల పలకరింపులతో, ఆనందాలతో నిండిపోయే ఆదివారపు సాయంత్రాలు.. ఇప్పుడు లేకపోవడం వల్ల శూన్యం ఆవరించినట్లు అనిపిస్తోంది" అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 12 షూటింగ్ ప్రారంభించారు. మరోవైపు కరోనా కాలంలో చాలా మంది ప్రజలు ఎటువంటి రక్షణ లేకుండా వీధుల్లో తిరగడం చూసి చాలా బాధగా ఉందని అన్నారు.
జులైలో అమితాబ్ కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరిన ఆయన.. ప్రతిరోజూ తన అభిమానులకు హెల్త్ అప్డేట్స్ను ఇస్తుండేవారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న నెగిటివ్ నిర్ధరణ కాగా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.