బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ వయస్సులో కంటి ఆపరేషన్ సున్నితంగా ఉంటుందని చెప్పారు. ఉత్తమ చికిత్సనే తీసుకుంటున్నానని అంతా మంచే జరుగుతుందని ఆశిద్దామన్నారు. నెమ్మదిగా కోలుకుంటున్నానని టైపింగ్‌లో తప్పులుంటే క్షమించాలని తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇంకో కంటికి కూడా శస్త్రచికిత్స జరగనుందని తెలిపిన అమితాబ్ తన తర్వాతి చిత్ర షెడ్యూలు నాటికి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల తాను ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలిపారు బిగ్‌బీ బ్లాగులో వెల్లడించారు. ఆయన సర్జరీ చేయించుకుంటున్నారని తెలియగానే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పష్టతనిచ్చిన అమితాబ్.. అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: అమితాబ్‌కు మోహన్‌లాల్ ప్రత్యేక కానుక