ETV Bharat / sitara

అమితాబ్​ బచ్చన్​ కూతురు ఎవరో తెలుసా? - అమితాబ్​ కత్రినా

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​, కత్రినా కైఫ్​.. తండ్రీకూతుళ్లుగా వెండితెరపై కనువిందు చేయనున్నారట. వికాస్​భల్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది.

Amitabh and katrina kaif are playing roles as father and daughter relation in 'dedly' movie
అమితాబ్​ బచ్చన్​ కూతురు ఎవరో తెలుసా!
author img

By

Published : Mar 24, 2020, 10:52 AM IST

కత్రినాకైఫ్‌ 'సూర్యవంశీ' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. కరోనా ప్రభావంతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. అంతలోనే కత్రినా ఓ కొత్త ఆఫర్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు వికాస్‌భల్‌ చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం.

Amitabh and katrina kaif are playing roles as father and daughter relation in 'dedly' movie
కత్రినాకైఫ్​

ఇది తండ్రీకూతుళ్ల నేపథ్యంగా సాగే వైవిధ్యమైన కథని సమాచారం. వికాస్‌, కత్రినా.. ఈ కథ, అందులోని పాత్రల గురించి అమితాబ్‌ బచ్చన్‌తో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. నటించడానికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని బాలీవుడ్​ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మే నెల నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. 'డెడ్లీ' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తోంది. గతంలో ఓ ప్రకటనలో అమితాబ్‌, కత్రినా తండ్రీకూతుళ్లుగా నటించారు.

ఇదీ చూడండి.. కరోనాపై మీ అభిమాన తారల సూచనలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.