ETV Bharat / sitara

లాక్​డౌన్ వేళ పార్టీలో అమలాపాల్​ డ్యాన్స్! - అమలాపాల్​ డ్యాన్స్ వీడియో

లాక్​డౌన్​లోనూ పార్టీ చేసుకుంది నటి అమలాపాల్. అయితే మీరునుకున్నట్లు ఇది పబ్​లోనూ, స్నేహితులతునో జరుపుకొన్న పార్టీ కాదు.

Amalapal dace video viral with corona mask
అమలాపాల్​
author img

By

Published : May 6, 2020, 2:07 PM IST

'బెజవాడ', 'లవ్‌ఫెయిల్యూర్‌', 'ప్రేమఖైదీ' తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అందాల తార అమలాపాల్‌. గత ఏడాది తమిళంలో 'ఆడై' సినిమాలో నూలు పోగులేకుండా కొన్ని సన్నివేశాల్లో నటించి, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ భామ.. పార్టీలో చిందులేస్తూ తెగ ఎంజాయ్‌ చేసింది. అయితే మనం అనుకున్నట్లు అది పబ్​లో జరిగిన పార్టీ కాదు. ముఖానికి మాస్క్‌ ధరించి, టీవీలో చూస్తూ, అందులో నుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా చిందేస్తూ కనిపించింది అమలాపాల్. ఈ వీడియోను తన ఇన్​స్టాలో పంచుకుంది.

"ఈరోజు నా ప్రియమైన, విచిత్రమైన, అందమైన ఒకే ఒక్క పాత సోదరుడు. నాకంటే చిన్నవాడు అయిన అభిజిత్‌ పాల్‌ పుట్టినరోజు. ఇది అందరు కలిసి చేసుకున్న పార్టీ కాదు. దూరం పాటిస్తూ, ముసుగు ధరించి చేసుకుంటున్న క్వారంటైన్‌ పార్టీ" అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె..‌ తన మాతృభాష మలయాళంలో 'ఆదుజీవితం' అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో పృథ్వీరాజ్‌తో కథానాయకుడు. దీనితో పాటే 'లస్ట్‌స్టోరీస్‌' తెలుగు రీమేక్​లోనూ ఓ పాత్ర పోషిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.