Dhee13 winner: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో 'ఢీ'. ఈటీవీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో 13వ సీజన్ బుధవారంతో పూర్తైంది. ప్రదీప్ వ్యాఖ్యాతగా సుధీర్-ఆది, రష్మి-దీపిక టీమ్ లీడర్లుగా.. ప్రియమణి, గణేశ్ మాస్టర్, పూర్ణ న్యాయనిర్ణేతలుగా గత కొన్ని నెలల నుంచి ప్రేక్షకులకు చేరువైన ఈ షో గ్రాండ్ ఫినాలే ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా జరిగిన ఈ తుదిపోరులో క్వీన్స్ టీమ్ నుంచి కావ్య, కింగ్స్ టీమ్ నుంచి కార్తిక్ హోరాహోరీగా తలపడ్డారు. వీరి మధ్య జరిగిన డ్యాన్స్ వార్ చూసి బన్నీ సైతం ఆశ్చర్యపోయారు.
తుదిపోరులో భాగంగా కావ్య-కార్తిక్ మధ్య.. ఫోక్, హిప్‌పాప్, ప్రొపర్టీ, టైరో, సాల్సా, చివరికి షూట్ అవుట్ విభాగాల్లో పోరు జరగ్గా.. కావ్య తన డ్యాన్స్‌తో ఫిదా చేసింది. ప్రతి రౌండ్‌లో ఆమె చేసిన మూమెంట్స్, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి న్యాయనిర్ణేతలు, ఢీ టీమ్‌తోపాటు బన్నీ వావ్ అంటూ కితాబిచ్చారు. అనంతరం అన్నిరౌండ్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కావ్యకు ‘ఢీ-13’ టైటిల్ అందజేశారు. మరోవైపు, ‘ఢీ’ తదుపరి సీజన్‌ను ప్రకటించి.. దాని టైటిల్‌ని బన్నీ లాంచ్ చేశారు. ‘ఢీ’ తదుపరి సీజన్ ‘ఢీ ది డ్యాన్స్ ఐకాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: విక్కీ-కత్రిన పెళ్లి.. వేడుకలో సెలబ్రిటీల సందడి