ETV Bharat / sitara

అల్లు అర్జున్ 'పుష్ప'.. రెండు భాగాలుగా! - రెండు పార్ట్​లుగా పుష్ప

బన్నీ- సుకుమార్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. కొన్నిరోజుల క్రితం విడుదలైన పుష్పరాజ్​ గ్లింప్స్​ అలరిస్తుండగా, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

Allu Arjun's Pushpa movie to release in Two Parts
రెండు భాగాలుగా తెరకెక్కనున్న 'పుష్ప'!
author img

By

Published : May 6, 2021, 2:45 PM IST

'తగ్గేదే లే' అంటూ మాస్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట.

ఈ నేపథ్యంలో 'పుష్ప' రిలీజ్‌ గురించి ఇప్పుడు అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనేది చాలా పెద్ద అంశం కావడం వల్ల ఈ కథను మొదట సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు అందించాలని సుకుమార్‌ భావించారట. అదే విషయాన్ని బన్నీతో చెప్పగా ఆయన కూడా సరే అన్నారట. దీంతో దేశంలో పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాదిలో 'పుష్ప' మొదటి భాగాన్ని, వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు చూసిన నెటిజన్లు.. 'ఇదేంటబ్బా కొత్తగా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్‌-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: బార్బీ బొమ్మకి చెల్లెలివా.. బాబోయ్​ ప్రపంచ సుందరివా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.