హీరోల లైఫ్ వేరు.. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనుకుంటాం. కానీ అల్లు అర్జున్ మాత్రం తన కంటే తన సిబ్బంది జీవితం ఎంతో బావుందని అంటున్నాడు. ఎందుకంటే.. బన్నీ స్టాఫ్‌లోని సభ్యుడు శరత్చంద్ర నాయుడు శనివారం సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఆ ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని చమత్కరిస్తూ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడీ కథానాయకుడు.
" class="align-text-top noRightClick twitterSection" data="'ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. మీరు శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఇలా ఫోటోలు దిగడం. రాత్రి వేళల్లో మీరు చేసే ఎంజాయ్ నేను చేయలేకపోతున్నాను. నా కంటే మీ జీవితం ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. నన్నూ పిలవొచ్చు కదయ్యా.' -ఇన్‌స్టాలో అల్లు అర్జున్
">