దేవుడికి పూజారి తరతరాలుగా సేవ చేసినట్లే, ప్రేక్షక దేవుళ్ల కోసం తరతరాలుగా తాను సినిమాలు చేస్తూనే ఉంటామని స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. తమ కుటుంబంపై వచ్చిన విమర్శలకు 'అల వైకుంఠపురములో' కృతజ్ఞత సభా వేదికగా బన్నీ సమాధానామిచ్చాడు. చిత్రానికి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. హైదరాబాద్‌లో సోమవారం ఈ వేడుకను నిర్వహించారు.
ఈ సినిమాలో భాగస్వామినవడం ఆనందంగా ఉందన్నారు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం. 'అల వైకుంఠపురములో'.. చిత్రపరిశ్రమలోని ఘన విజయాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సచిన్‌కు పుల్ టాస్ వేస్తే ఏమవుతుందో బన్నీకి ఈ సినిమా అలానే అయిందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆనందాన్ని పంచుకున్నాడు.
ఈ నెల 18న వైజాగ్‌లో ఘనంగా 'అల వైకుంఠపురములో' విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది.
ఇవీ చదవండి: