Alluarjun fans inujred: ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌తో ఫొటోషూట్ ఉందని తెలుసుకొని సోమవారం గీతాఆర్ట్స్ కార్యాలయం వద్దకు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు. అయితే వారిని నిలువరించే క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఈ సంఘటనపై అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా స్పందించారు.
"నా అభిమానులు ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా బృందం వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక