ETV Bharat / sitara

'పుష్ప' సినిమాలోని​ 'ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. - allu arjun rashmika movie

'పుష్ప' చిత్రంలోని 'ఇది నా అడ్డా' సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. శ్రోతల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ALLU ARJUN PUSHPA MOVIE
పుష్ప సినిమాలో అల్లు అర్జున్
author img

By

Published : Nov 19, 2021, 11:11 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ఇందులోని నాలుగో పాట 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' లిరికల్ పాట రిలీజైంది. పూర్తి మాస్​లుక్​లో కనిపిస్తున్న బన్నీ.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో తీసిన 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్స్.. అభిమానుల్ని అలరిస్తున్నాయి.

ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఆ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. డిసెంబరు 17న ఈ సినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.