టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ స్టైలే వేరు. తన స్టైలిష్ లుక్స్‌తో బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. తాజాగా మరో కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు బన్నీ. దీనికి సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిల్లో తన భార్యతో కలిసి కనువిందు చేశాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. గంధపు చెక్క స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడింది.