ETV Bharat / sitara

మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ.. బీచ్​లో ఎంజాయ్ చేస్తూ! - మాల్దీవుల్లో ఫ్యామిలీతో అల్లు అర్జున్​

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'(Puspha movie shooting update). దీని చిత్రీకరణ చివరి దశకు చేరింది. మరో షెడ్యూల్​కు ముందున్న గ్యాప్​ను ఫ్యామిలీ టైమ్​గా మార్చుకున్నారు బన్నీ. భార్య స్నేహా, పిల్లలతో కలిసి మాల్దీవులు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

allu arjun
అల్లు అర్జున్​
author img

By

Published : Oct 13, 2021, 2:13 PM IST

స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్​ కుటుంబానికి ఇచ్చే వాల్యూ అంతాఇంతా కాదు. ఎప్పుడూ షూటింగ్​లతో బీజీగా గడిపే బన్నీ కొంచెం సమయం దొరికినా సరే ఇంట్లో ఉండి పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. అల్లు అర్జున్​ హీరోగా.. సుకుమార్​ కాంబినేషన్​లో వస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్ 'పుష్ప'. ఈ సినిమా షూటింగ్ (Puspha movie shooting update)​ నుంచి బన్నీకి కాస్తా విరామం దొరికింది. దీంతో వెంటనే ఫ్యామిలీతో పాటు బెస్ట్​ హాలీడే స్పాట్​ అయిన మాల్దీవులకు వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి ఎంజాయ్​ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్​ భార్య స్నేహా ఇన్​స్టాలో షేర్​ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

వారాంతానికి తిరిగి హైదరాబాద్​ చేరుకోనున్న బన్నీ తిరిగి 'పుష్ప' షూటింగ్​లో పాల్గొంటారు. వచ్చే నెలలో బన్నీకి సంబంధించిన షూటింగ్​ పూర్తి కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ముత్తంశెట్టి మీడియాతో కలిసి నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్ ప్రతినాయకులుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి: 'పుష్ప' రెండో సాంగ్ రిలీజ్.. అలరిస్తోన్న బన్నీ, రష్మిక కెమిస్ట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.