ETV Bharat / sitara

'అభిమానులు గర్వపడేలా ముందుకు సాగుతా' - Trivikram Srinivas News

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్​ నైట్​ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్ చేశా అంటూ చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్
author img

By

Published : Jan 7, 2020, 7:31 AM IST

Updated : Jan 7, 2020, 11:50 AM IST

"ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ, నాకు ఆర్మీ ఉంది. అభిమానులు, నా పిల్లల వల్లే ఇంత గ్యాప్‌ తీసుకున్నా అస్సలు బోరు కొట్టకుండా ఉన్నాను" అన్నాడు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర మ్యూజికల్‌ నైట్‌ జరిగింది.

"అందరూ గ్యాప్‌ వచ్చిందని అడుగుతున్నారు. 'సరైనోడు', 'డీజే', 'నా పేరు సూర్య..' ఈ మూడు సినిమాలు అయిన తర్వాత నాకు ఒక కోరిక కల్గింది. ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్‌ చేశా. చాలా కథలు విన్నా ఏవీ నచ్చలేదు. అలాంటి కథ సెట్‌ కావడానికి త్రివిక్రమ్‌గారి ప్రాజెక్టులు పూర్తవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే ఇంత గ్యాప్‌. రిలీజ్‌లో గ్యాప్‌ ఉంటుంది కానీ, సెలబ్రేషన్‌లో గ్యాప్‌ ఉండదు."

అల్లు అర్జున్
అల్లు అర్జున్

"ఈ ఖాళీ సమయంలో నేను నా భార్యతో కలిసి మ్యూజిక్‌ బ్యాండ్‌లకు వెళ్లడం వల్లే పాటలో అందరూ కనిపించాలని నేను అనుకున్నా. 'సామజవరగమన' ఇంత సెన్సేషన్‌ అవుతుందని నేను అనుకోలేదు. "ఎక్కడకి వెళ్లినా ఈ పాటే పాడుతున్నారు. విసుగు వచ్చేస్తోంది" అని నా భార్య అంది. ప్రపంచం ముందు హీరో అవడం కన్నా, భార్య ముందు హీరో అయితే, ఆ ఆనందమే వేరు. ఈ సినిమాలో పాట రాసిన ప్రతి రచయిత, పాడిన గాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. తమన్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు. ఈ సినిమాలోని పాటలతో ఆయనకు ఒక గౌరవం వచ్చింది. పీఎస్‌ వినోద్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. మురళీ శర్మగారు, జయరామ్‌గారు చాలా చక్కగా నటించారు. సునీల్‌, సుశాంత్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణల పాత్రలు ప్రత్యేకంగా అలరిస్తాయి. 'రాములో రాములా' పాట చూసి మా అమ్మాయి దోశ స్టెప్‌ వేశానంది(నవ్వులు). దేన్నైనా సృష్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకు.. ఇంకొకటి వాళ్లకి(ఆడవాళ్లు) అన్నట్లు మనం మహిళలను గౌరవించాలి. పూజాహెగ్డే, నివేదా పేతురాజు చాలా చక్కగా నటించారు. టబుగారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్‌."

"నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమా కోసం మేము అడిగిన ప్రతిదాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆనందాన్ని ఇచ్చేది దర్శకుడే. మేమంతా పలు రకాల రంగులం.. మమ్మల్ని కలిపి ఒక అద్భుత చిత్రంగా తీసేది దర్శకుడు మాత్రమే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారు.. ఆయన ఇచ్చిన సినిమాలే. నా ప్రతి కోరికనూ, ఇష్టాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేసినా.. ఏనాడూ నా తండ్రికి ధన్యవాదాలు చెప్పలేదు. నేను తండ్రి అయ్యాక తెలిసింది నాన్న విలువ ఏంటో.. ఇప్పుడు చెబుతున్నా 'థ్యాంక్యూ డాడీ'(భావోద్వేగంతో కన్నీళ్లు). నేను నా తండ్రి అంత గొప్పవాడిని ఎప్పటికీ కాలేను. ఆయనలో సగం అయితేచాలు. 'ఆర్య' సినిమా చేసినప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అప్పటికే నా దగ్గర రూ.కోటి ఉన్నాయి. నాకు పెళ్లయిన తర్వాత నా భార్యను ఒక్కటే అడిగా."

అల్లు అర్జున్
అల్లు అర్జున్

"నేను మా నాన్న దగ్గరే ఉంటాను. నీకు పర్వాలేదు కదా" అని అడిగా. నాన్నంటే అంత ప్రేమ నాకు. నేను చూసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆయనొకరు. "అబ్బో అల్లు అరవింద్‌ డబ్బులు కాజేస్తారు" అని చాలా మంది అంటుంటారు. కానీ, ఆయన పది రూపాయల వస్తువును రూ.7కు బేరం చేస్తారు. ఆ తర్వాత అది రూ.6కు ఇచ్చినా, ఇంటికి వెళ్లి మరీ రూ.7 ఇచ్చి వస్తారు. అలాంటి మంచి వ్యక్తి ఆయన. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ, ఆయనకు పద్మశ్రీ రావాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలని విన్నవిస్తున్నాను."

"సినిమా తీయడంలో ఇంత గ్యాప్‌ తీసుకున్నా, అభిమానులు, నా పిల్లల వల్లే నేను చాలా ఆనందంగా ఉన్నా. చాలా మంది అభిమానులు నా పేరును టాటూ వేసుకున్నారు. ఒక గొప్ప వ్యక్తి పేరును టాటూ వేసుకున్నానని మీరు గర్వపడేలా జీవితంలో ముందుకు సాగుతా. సంక్రాంతికి సందర్భంగా 'దర్బార్‌', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎంత మంచి వాడవురా' సినిమాలు విడుదలవుతున్నాయి. వాళ్ల సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అల్లు అర్జున్‌ తెలిపాడు.

ఇవీ చూడండి.. తేజ్.. శర్వా.. వద్దన్న కథతో విజయ్ దేవరకొండ!

RESTRICTION SUMMARY: NO ACCESS FRANCE
SHOTLIST:
BFM TV - NO ACCESS FRANCE
Paris - 6 January 2020
1. SOUNDBITE (French) Jean-Yves Le Drian, French Foreign Minister:
"The situation is serious. The situation is very serious. The chain reaction of the escalation is extremely concerning. And if this goes on it could lead to a conflict. Yes, that is the truth. And this is why we need to mobilize all our efforts in order to put an end to a situation which is extremely disturbing and could take us to tormented scenarios that will be difficult to control."
++DISSOLVE++
2. SOUNDBITE (French) Jean-Yves Le Drian, French Foreign Minister:
"Following up on all the conversations the President of the Republic had so far with his counterparts: Russians, Europeans, Americans and the all the contacts I had on my end as well over the last few days, I can see that nobody wants a war. Everyone is saying - this isn't possible, we need to put an end to the escalation so let's find the means to do it. It firstly means for. the Iranians relinquish the option of retaliation but also that we open negotiations, that Iran comes back to the Vienna accords and that the negotiations on regional stability are resumed."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
French Foreign Minister Jean-Yves Le Drian said signatories of the 2015 nuclear accord with Iran were considering the possibility of invoking a dispute resolution clause - a further sign that the agreement could be on its last legs.
Le Drian said on Mondat that a decision on the question could come within days.
His remarks came after Tehran announced that it no longer considered itself limited by the accord, meant to stop Iran from pursuing its atomic weapons programme.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 7, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.