ETV Bharat / sitara

బన్నీ క్రేజ్.. 'అల వైకుంఠపురములో' మళ్లీ థియేటర్లలో రిలీజ్

author img

By

Published : Jan 17, 2022, 10:51 AM IST

Updated : Jan 17, 2022, 4:11 PM IST

Ala vaikunthapurramuloo hindi dubbed: 'పుష్ప' సినిమాతో పబ్లిసిటీ లేకపోయినా సరే కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన బన్నీ.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్​ను షేక్​ చేసేందుకు రెడీ అవుతున్నారు.

allu arjun ala vaikunthapurramuloo movie
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీ

Allu arjun ala vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గత కొన్నిరోజుల వరకు తెలుగు హీరో. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. 'పుష్ప'గా సంచలనం సృష్టించిన బన్నీ.. ఈ సినిమా హిందీ వెర్షన్​తో రికార్డు స్థాయిలో దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బాలీవుడ్​ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

2020 జనవరిలో 'అల వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్, టాలీవుడ్​లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీ వెర్షన్​నే ఈ జనవరి 26న నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.

ఇవీ చదవండి: బన్నీ సినిమా రిలీజ్ ఆపేందుకు రూ.8కోట్లు ఖర్చు చేశారా?

ఈ సినిమాలో 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలు ఎంత సెన్షేషన్​ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్​లో ఆ పాటలకు వచ్చిన వ్యూస్, సోషల్ మీడియాలో వాటికి ఉన్న క్రేజ్ దీనికి ఉదాహరణ.

అయితే 'అల వైకుంఠపురములో' సినిమాను ప్రస్తుతం హిందీలోనూ 'షెహజాదే' పేరుతో రీమేక్​ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతిసనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఒరిజినల్​ వెర్షన్ ఇప్పుడు​ రిలీజ్ అయిపోతే, దీని పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 17, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.